- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రభుత్వాసుపత్రుల్లో అనాథ పిల్లలకు ప్రత్యేక వార్డులు
<p>దిశ, తెలంగాణ బ్యూరో: అనాథ పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వాసుపత్రుల్లో అలాంటి చిన్నారుల కోసం స్పెషల్ వార్డులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు ఫైలట్ ప్రాజెక్ట్ కింద నిలోఫర్ ఆసుపత్రిలో తొలి విడత అతి త్వరలో అందుబాటులోకి తేనున్నారు. సుమారు 250 బెడ్లతో సౌకర్యాలు కల్పించనున్నట్లు అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. వీటి ఏర్పాటు, నిర్వహణకు స్త్రీ , శిశు ,సంక్షేమశాఖ ప్రత్యేకంగా నిధులను కేటాయించనున్నట్లు ఓ అధికారి తెలిపారు. […]</p>

దిశ, తెలంగాణ బ్యూరో: అనాథ పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రభుత్వాసుపత్రుల్లో అలాంటి చిన్నారుల కోసం స్పెషల్ వార్డులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు ఫైలట్ ప్రాజెక్ట్ కింద నిలోఫర్ ఆసుపత్రిలో తొలి విడత అతి త్వరలో అందుబాటులోకి తేనున్నారు. సుమారు 250 బెడ్లతో సౌకర్యాలు కల్పించనున్నట్లు అక్కడి డాక్టర్లు చెబుతున్నారు. వీటి ఏర్పాటు, నిర్వహణకు స్త్రీ , శిశు ,సంక్షేమశాఖ ప్రత్యేకంగా నిధులను కేటాయించనున్నట్లు ఓ అధికారి తెలిపారు. అయితే ఈ వార్డులలో 6 ఏళ్ల లోపు చిన్నారులకు మాత్రమే వైద్యం అందించనున్నారు. తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, అనాథ శ్రయాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులకు ఈ స్పెషల్ వార్డులలో చికిత్సను అందించనున్నట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. వీటిలో అడ్మిట్ అయిన చిన్నారులకు వైద్యసేవలు, పర్యవేక్షణ కొరకు ప్రత్యేకంగా డాక్టర్లు, నర్సులు, అదనపు సిబ్బందిని సమకూర్చనున్నట్లు వైద్యాధికారులు వివరించారు. విడతల వారీగా అన్ని టీచింగ్, జిల్లా ఆసుపత్రుల్లో ఈ విధానాన్ని తేనున్నారు.
ఇదే కారణం..?
అనాథ పిల్లలకు సాధారణ వార్డులలో వైద్యం అందించడం వలన అనేక ఇబ్బందులతో పాటు పర్యవేక్షణ లోపం వస్తున్నట్లు ఇటీవల అన్ని ప్రభుత్వాసుపత్రుల వైద్యాధికారులు సర్కార్‌కు వివరించారు. పేషెంట్‌కు సహయకులుగా ఎవరూ లేని కారణంగా ఆరోగ్య పరిస్థితి వేగంగా అంచనా వేయడం, చికిత్సను అందించడం కాస్త కష్టంగా మారిన్నట్లు పేర్కొన్నారు. అంతేగాక టెస్టులు, ఇతర పరీక్షలకు తీసుకువెళ్లేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నట్లు వివరించారు. ముఖ్యంగా ఆరేళ్ల చిన్నారుల్లో ఈ పరిస్థితి ఎక్కువగా వస్తున్నట్లు డాక్లర్లు తెలిపారు. ప్రభుత్వాసుపత్రుల్లో రోగుల సంఖ్య ఎక్కువగా ఉండటం వలన వారిని పర్యవేక్షించడం నర్సులకూ కష్టంగా మారినట్లు స్పష్టం చేశారు. దీంతో కొన్ని సందర్భాల్లో ఎవరూ లేని పిల్లల ఆరోగ్యం విషమ స్థాయి పరిస్థితుల్లోకి వెళ్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. దీంతోనే సర్కార్ ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నది.
- Tags
- Government






