తుంగభద్ర నదితీరంలో విశేష ఆలయాలు

by  |
తుంగభద్ర నదితీరంలో విశేష ఆలయాలు
X

దిశ, వెబ్‎డెస్క్: పన్నెండేళ్ళకోసారి వచ్చే పవిత్ర తుంగభద్ర నదికి పుష్కరాలు ఈ ఏడాది జరగనున్నాయి. 2008లో జరిగిన పుష్కరాలు శ్రీ శార్వరి నామ సంవత్సరంలో జరుగనున్నాయి. 2020 నవంబరు 20వ తేదీన ప్రారంభమై.. డిసెంబరు ఒకటి వరకూ కొనసాగనున్నాయి. ఒక్కొక్క రాశిలో గురువు ప్రవేశించేటప్పుడు ప్రతీ నదికి పుష్కరాలు జరుపుతారు. కాబట్టి 12 నదులను పుష్కర నదులని , 12 రోజుల పాటు జరిగే ప్రక్రియను పుష్కరాలని జరుపుకుంటారు.

కర్ణాటక ఎగువ భాగాన తుంగ, భద్ర నదుల సంగమమే తుంగభద్ర నది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం మేళగనూరు వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించి సంగేమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలిసిపోతుంది. కౌతాళం, కొసిగి, మంత్రాలయం, నందవరం, సి.బెళగళ్, గూడూరు మండలాలతో పాటు కర్నూలు నగరం వరకు 107 కిలోమీటర్ల మేర తుంగభద్రమ్మ నదీతీర ప్రాంతం ఉంది.

తుంగ భద్రానది ముందుగా మేళిగనూరు వద్ద రామలింగేశ్వరస్వామి ఆలయాలన్ని తాకుతోంది. కోసిగిలో ఆర్డీ‌ఎస్ ఆనకట్ట, మంత్రాలయం మండలంలో రాంపురం రామలింగేశ్వర స్వామి ఆలయం, మాధవరం వద్ద నదిలోనే ఓ శివాలయాన్ని తాకి వస్తోంది. మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి ఆలయాలను తాకుతూ, గురజాల ఇసుక రామలింగేశ్వర స్వామి ఆలయం మీదుగా కర్నూలు చేరుకుంటుంది. నాగులదిన్నె సమీపంలో సాయిబాబా దేవాలయం ఉంది. అనంతరం సి.బెళగల్ మండలం సంగాల ఈశ్వరాలయం వద్ద కృష్ణానదిలో కలిసిపోతోంది. ఈ ఏడాది వర్షాలు బాగా కురవడంతో ప్రస్తుతానికి తుంగభద్ర జలాశయం జలకళను సంతరించుకోంది.

Advertisement
Next Story

Most Viewed