పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమం చాలా ముఖ్యం : ఎస్పీ రాజేంద్రప్రసాద్

by  |
పోలీస్ సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమం చాలా ముఖ్యం : ఎస్పీ రాజేంద్రప్రసాద్
X

దిశ, సూర్యాపేట : పోలీస్ సిబ్బంది సంక్షేమం, ఆరోగ్యం చాలా ముఖ్యమని ఎస్పీ రాజేంద్రప్రసాద్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్‌లో పోలీసు సిబ్బంది సంక్షేమ వసతులను ఆయన పరిశీలించారు. పోలీసుల యోగక్షేమాలు చూసుకున్నప్పుడే వారు మరింత ఉత్సాహంతో ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఒకవేళ వారి పట్ల మనం నిర్లక్ష్యం చేస్తే ప్రభుత్వం పట్ల వారు అనాసక్తిగా ఉంటారు. దీనిని మనం పరిగణనలో పెట్టుకొని వారికి మనం మంచి వాతావరణం కల్పించాలి.

అంతేకాకుండా జిమ్ సెంటర్, స్టేడియం, విమెన్ రెస్ట్ రూమ్స్, వాటర్ ప్లాంట్‌లను పరిశీలించారు. స్పోర్ట్స్ కొరకు అన్నీ రకాల సౌకర్యాలు ఉండాలని అన్నారు. జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్‌లలో పని చేస్తున్న పోలీసు సిబ్బంది, అధికారులు పని నిమిత్తం వచ్చే వారి యొక్క అవసరాలు తీర్చేలా వసతులు కల్పన చేయాలని ఆర్ముడ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట ఆర్‌ఐ నర్సింహారావు, గోవిందరావు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐలు శివ కుమార్, నవీన్ తదితరులు ఉన్నారు.


Next Story