'ఫిట్‌గా ఉంటే రోహిత్‌ను పంపిస్తాం'

by  |
ఫిట్‌గా ఉంటే రోహిత్‌ను పంపిస్తాం
X

దిశ, స్పోర్ట్స్ : తొడ కండరాల గాయంతో బాధపడుతున్న రోహిత్ శర్మ గత కొన్ని రోజులుగా ఐపీఎల్ మ్యాచ్‌లు కూడా ఆడటం లేదు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి కూడా రోహిత్‌ను తప్పించారు. దీనిపై పలు విమర్శలు వచ్చాయి. వాటిపై తొలి సారిగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు.

‘టీమ్ఇండియాలో రోహిత్ శర్మ కీలక సభ్యుడు. అతడిని కావాలని ఎందుకు తప్పిస్తాం. గాయం కారణంగానే రోహిత్‌ను పక్కన పెట్టాము. ఒక వేళ అతడు ఫిట్‌గా ఉన్నట్లు నిరూపించుకుంటే ఆసీస్ పర్యటనకు తప్పకుండా పంపిస్తాం. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న రోహిత్.. ముంబయి తరపున ప్లేఆఫ్స్ ఆడటంపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. అంతర్జాతీయ క్రికెట్‌లో అతడికి ఇంకా చాలా కెరీర్ ఉంది. గాయాన్ని పెద్దగా చేసుకోవడం వల్ల అతడికే నష్టం కలుగుతుంది. కాబట్టి ముంబయి ఇండియన్స్ తరపున ఆడాలా వద్దా అనేది రోహిత్ తేల్చుకోవాలి’ అని సౌరవ్ చెప్పాడు. మరోవైపు సూర్యకుమార్ యాదవ్‌కు సరైన సమయంలో అవకాశం లభిస్తుందని గంగూలీ భరోసా ఇచ్చాడు.



Next Story

Most Viewed