పెళ్ళి కాక ముందే తల్లి కాబోతున్న తమన్నా భాటియా..? ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వార్త

by Disha Web Desk 6 |
పెళ్ళి కాక ముందే తల్లి కాబోతున్న తమన్నా భాటియా..? ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వార్త
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా అందరికీ సుపరిచితమే. ఈ అమ్మడు బాలీవుడ్, టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ గత కొద్ది కాలంగా స్టార్ హీరోయిన్‌గా ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అంతేకాకుండా వెబ్ సిరీస్‌లు కూడా చేసి నెట్టింట సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది. అయితే తమన్న 2005లో ‘శ్రీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. ఎన్నో హిట్ చిత్రాలు చేసి మెప్పించింది. అంతేకాకుండా టాలీవుడ్ స్టార్స్ సరసన నటించి భారీ క్రేజ్‌తో కెరీర్‌లో దూసుకుపోతుంది. ముఖ్యంగా బాహుబలి చిత్రంతో వరల్డ్ వైడ్‌గా పాపులారిటీ తెచ్చుకుంది. 2023లో జైలర్, లస్ట్ స్టోరీస్‌ అనే వెబ్ సిరీస్ చేసి రెండు హిట్స్ అందుకుంది. ఇక ఇప్పుడు బాక్, ఓదెల-2 వంటి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది.

అయితే తమన్న పర్సనల్ విషయానికొస్తే.. ఈ అమ్మడు నటుడు విజయ్ వర్మతో గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తొందరలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. నిత్యం వెకేషన్స్‌కు వెళ్తూ కెమెరాకు చిక్కుతున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, తమన్నా భాటియాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పెళ్లి కాకముందే ఆమె తల్లి కాబోతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. తమన్న-విజయ్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. పెళ్లి కాకముందే ఓ బిడ్డను కణాలని ఈ జంట డిసైడ్ అయినట్లు టాక్.

ఒకరిని కన్న తర్వాత పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగుంటుందని బాధ్యతలు తెలుస్తాయని వీరిద్దరి మధ్య చర్చ వచ్చిందట. ఈ విషయం బయటకు రావడంతో అది తెలుసుకున్న నెటిజన్లు పెళ్లి కాకముందే తల్లిదండ్రులు కావాలని అనుకోవడం ఏంటని? చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత ఉందనేది తెలియనప్పటికీ ప్రస్తుతం తమన్నా భాటియా వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఆమె ఫ్యాన్స్ మాత్రం వాటన్నింటినీ కొట్టిపారేస్తున్నారు. ఆమె వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయడమేంటని ఫైర్ అవుతున్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story