మైనస్ డిగ్రీస్ టెంపరేచర్‌లో సోనమ్ షూటింగ్

by  |
మైనస్ డిగ్రీస్ టెంపరేచర్‌లో సోనమ్ షూటింగ్
X

దిశ, సినిమా: బాలీవుడ్ దివా సోనమ్ కపూర్ లేటెస్ట్ పోస్ట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘బ్లైండ్’ షూటింగ్ పూర్తి కావడంతో హుషారుగా ఉంది బ్యూటీ. మైనస్ డిగ్రీ టెంపరేచర్‌లో గ్లాస్గో, స్కాట్లాండ్‌లో 39 రోజుల కంటిన్యుయస్ షూటింగ్ షెడ్యూల్‌లో పాల్గొన్న గార్జియస్ సోనమ్..చిత్రీకరణ పూర్తైనట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టింది.

తక్కువ వ్యవధిలో షూటింగ్ పూర్తి చేయడంపై ఆనందంగా ఉన్న బ్యూటీ..యంగ్ డైరెక్టర్ షోమ్ మఖీజా, టీం మెంబర్స్‌తో కలిసి క్యూట్ బూమ్‌రంగ్ పోస్ట్ చేసింది. పురబ్ కోహ్లీ, వినాయక్ పాటక్, లిల్లెట్ దుబె‌ ఈ చిత్రంలో కీలకపాత్రల్లో కనిపించబోతుండగా..సీరియల్ కిల్లర్‌ను పట్టుకునే బ్లైండ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది సోనమ్. సుజోయ్ ఘోష్, అవిషేక్ ఘోష్, మనిషా డబ్ల్యూ, ప్రిన్స్ నహర్, సచిన్ నహర్, హ్యూన్వో థామస్ కిమ్ నిర్మిస్తున్న సినిమాను ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.


Next Story

Most Viewed