- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తండ్రిని హతమార్చిన తనయుడు
<p>దిశ, అదిలాబాద్: వృద్ధాప్యంలో సపర్యలు చేయాల్సిన ఓ కొడుకు తండ్రి పట్ల కాలయముడయ్యాడు. తాగిన మైకంలో బండరాయితో మోది హతమార్చిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్‌లో గల ఎస్సీ కాలనీకి చెందిన బద్వేలు (70) తాపీ మేస్త్రి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తనయుడు సురేష్ మద్యం సేవించి సోమవారం అర్ధరాత్రి ఇంటికి రాగా తండ్రి బద్వేలు మందలించాడు. దీంతో తండ్రి కొడుకుల మధ్య వాగ్వివాదం […]</p>

దిశ, అదిలాబాద్: వృద్ధాప్యంలో సపర్యలు చేయాల్సిన ఓ కొడుకు తండ్రి పట్ల కాలయముడయ్యాడు. తాగిన మైకంలో బండరాయితో మోది హతమార్చిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా కేంద్రంలోని కైలాష్ నగర్‌లో గల ఎస్సీ కాలనీకి చెందిన బద్వేలు (70) తాపీ మేస్త్రి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో తనయుడు సురేష్ మద్యం సేవించి సోమవారం అర్ధరాత్రి ఇంటికి రాగా తండ్రి బద్వేలు మందలించాడు.
దీంతో తండ్రి కొడుకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకున్నది. తనయుడు సురేష్ కోపంతో తాగిన మైకంలో తండ్రి బద్వేలు పై బండరాయితో దాడి చేశాడు. తలకు గాయమై తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక డీఎస్పీ వెంకటేశ్వర్లు, రూరల్ సీఐ పురుషోత్తమాచారి తో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు సురేష్ పరారీలో ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. నిందితుడిని త్వరలో పట్టుకొని రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు.






