- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీవు లేక నేను లేనంటూ..
<p>దిశ, కూకట్పల్లి : అనారోగ్యంతో తండ్రి మృతి చెందడంతో మనస్థాపం చెందిన ఓ కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిమెట్ల దండమూడి ఎన్క్లేవ్ రోడ్డులోని ఎన్‌సీఎల్ సింధులో నివాసం ఉంటున్న ఐ.పినాకపాణి(56) తన తండ్రి ఐ.కృష్ణ మూర్తితో కలిసి నివాసముంటున్నాడు. కొన్ని రోజుల కిందట అనారోగ్యం బారిన పడి తండ్రి కృష్ణమూర్తి మృతి చెందాడు. మృతుడి తల్లి జీడిమెట్ల లోని శ్వేత ఆర్యన్ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న […]</p>

దిశ, కూకట్పల్లి : అనారోగ్యంతో తండ్రి మృతి చెందడంతో మనస్థాపం చెందిన ఓ కొడుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిమెట్ల దండమూడి ఎన్క్లేవ్ రోడ్డులోని ఎన్‌సీఎల్ సింధులో నివాసం ఉంటున్న ఐ.పినాకపాణి(56) తన తండ్రి ఐ.కృష్ణ మూర్తితో కలిసి నివాసముంటున్నాడు.
కొన్ని రోజుల కిందట అనారోగ్యం బారిన పడి తండ్రి కృష్ణమూర్తి మృతి చెందాడు. మృతుడి తల్లి జీడిమెట్ల లోని శ్వేత ఆర్యన్ అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న పినాకపాణి అన్న ఐ.వెంకట రమణ ఇంటికి వెళ్లింది. అయితే, తండ్రి మృతితో తీవ్ర మనస్థాపానికి గురైన పినాకపాణి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఫ్యాన్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తండ్రి కర్మ గురించి పినాకపాణితో మాట్లాడటానికి వెళ్లిన బంధువులు తలుపు తెరిచి చూడగా పినాకపాణి ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.






