- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎలా చదువుకోవాలి..? పాఠశాలలో మద్యం బాటిళ్లతో అరాచకం
by Sridhar Babu |
<p>దిశ, చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా బొమ్మనపల్లి గ్రామంలోని లాలయ్య పల్లి పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో కొంతమంది గుర్తుతెలియని దుండగులు మద్యం సేవించి బాటిళ్లను పగులగొట్టారని పదో వార్డు సభ్యురాలు కొంకట రజిత తెలిపారు. పాఠశాలలో బీర్లు తాగి పగులగొట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఈ పాఠశాలలో మందు బాబులు మద్యం తాగి సీసాలు పగులగొట్టి నానా హంగామా చేశారని, మళ్ళీ ఇప్పుడు గ్రామంలోని యువత పాఠశాలలో తాగి మద్యం సీసాలు […]</p>

X
దిశ, చిగురుమామిడి : కరీంనగర్ జిల్లా బొమ్మనపల్లి గ్రామంలోని లాలయ్య పల్లి పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో కొంతమంది గుర్తుతెలియని దుండగులు మద్యం సేవించి బాటిళ్లను పగులగొట్టారని పదో వార్డు సభ్యురాలు కొంకట రజిత తెలిపారు. పాఠశాలలో బీర్లు తాగి పగులగొట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కూడా ఈ పాఠశాలలో మందు బాబులు మద్యం తాగి సీసాలు పగులగొట్టి నానా హంగామా చేశారని, మళ్ళీ ఇప్పుడు గ్రామంలోని యువత పాఠశాలలో తాగి మద్యం సీసాలు పగులగొట్టారని వివరించారు. విద్యార్థుల భవిష్యత్‌కు మార్గదర్శనం చేసే దేవాలయాల్లాంటి పాఠశాలలో మళ్లీ ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్, గ్రామపంచాయతీ పాలకవర్గం పైన ఉందని ఆమె స్పష్టం చేశారు.
Next Story






