కంగనాపై మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు

64

దిశ, స్పోర్ట్స్: టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, సినీ నటి కంగనా రనౌత్ మధ్య సోషల్ మీడియా మాటల యుద్ధం జరిగింది. ప్రస్తుతం ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇర్ఫాన్ ఒక ట్వీట్ చేశాడు. ఈ కష్టకాలంలో పాలస్తీనా ప్రజలకు అండగా ఉండాలని కోరాడు. దీనికి కంగనా స్పందిస్తూ.. ఇర్ఫాన్ పఠాన్‌కు ఇతర దేశాలపై అమితమైన ప్రేమ ఉంది. కానీ తన సొంత దేశం బెంగల్‌లో జరిగిన హింసపై మాత్రం ట్వీట్ చేయలేకపోయాడు అని ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. దీనికి ఇర్ఫాన్ కూడా ఘాటుగానే స్పందించాడు. ‘నేను చేసే ట్వీట్లు అన్నా మానవత్వం ఉన్న మనిషిగా చేసేవే. దేశానికి అత్యున్నత స్థాయిలో సేవ చేసిన వ్యక్తిగా నా అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాను. కానీ కంగనా లాంటి పెయిడ్ అకౌంట్స్ ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాయి. అందుకే వారి ఖాతాలు సస్పెన్షన్‌కు గురయ్యాయి’ అని ట్వీట్ చేశాడు. ఇటీవల కంగనాను ట్విట్టర్ బ్యాన్ చేయడంతో ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజెస్ చేస్తున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..