Sneha Ullal: నగ్నంగా యువకుని కౌగిలిలో నటి.. తనేనా అని ఆరాతీస్తున్న ఫ్యాన్స్

by  |
Sneha Ullal: నగ్నంగా యువకుని కౌగిలిలో నటి.. తనేనా అని ఆరాతీస్తున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘ఉల్లాసంగా ఉత్సాహంగా ‘చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై జూనియర్ ఐశ్వర్య రాయ్ గా కుర్రకారును ఉర్రుతలూగించిన హీరోయిన్ స్నేహ ఉల్లాల్. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తో ‘సింహ’ లో జానకి..జానకి అంటూ స్టెప్పులేసి అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్ లో కనుమరుగైందనే చెప్పాలి. ఇక ఇటీవలే డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టిన అమ్మడు 'ఎక్స్ పైరీ డేట్' అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. ఇక అక్కడ కూడా ఈ భామకు నిరాశ తప్పలేదు. ఇకపోతే సినిమాలు, వెబ్ సిరీస్ లు పక్కన పెడితే అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులకు దగ్గరగా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలతో పిచ్చెక్కించే స్నేహ ఉల్లాల్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో బెడ్ పై నగ్నంగా ఒక యువకుని బిగి కౌగిలిలో బందీ అయ్యి ఉంది. ఈ ఫోటోని ఉల్లాల్ తన సోషల్ మీడియాల్లో షేర్ చేయగా.. ఇంతకీ అది ఉల్లాలేనా? అన్న సందేహం వ్యక్తమైంది. వెనకనుండి ఉన్న ఈ ఫొటోలో అమ్మాయి ఫేస్ సరిగ్గా కనిపించడం లేదు కానీ యువకుడు మాత్రం ఫారినర్ లా కనిపిస్తున్నాడు. దీంతో నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఏ క్యాప్షన్ లేకుండా ఈ ఫోటో పోస్ట్ చేయడంపై స్నేహ ఉద్దేశం ఏమైఉంటుందా అని అందరు బుర్రలు గోక్కుంటున్నారు. ఇంతకీ ఆమె స్నేహా ఉల్లాల్ యేనా..? ఒక వేళ ఆమె అయితే ఆమెను అంత గట్టిగా కౌగిలిలో బంధించిన ఆ ప్రేమ ఖైదీ ఎవరు..? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా ఈ విషయం తెలియాలంటే ఈ జూనియర్ ఐశ్వర్య నే నోరు విప్పాలి మరీ



Next Story

Most Viewed