- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ap News :పవన్ కల్యాణ్‌ను కలిశానని పోలీసులు వేధించారు: శివశ్రీ
<p>దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని..అది చూడలేకే తాను వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు శివశ్రీ అనే యువతి స్పష్టం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి అమరారెడ్డి కాలనీకి చెందిన ఆమె నిర్వాసితుల కోసం ఇటీవలే పవన్ కళ్యాణ్‌ను కలిసింది. పవన్ కల్యాణ్‌ను కలిసినప్పటి నుంచి పోలీసులు తనను వేధించారని వాపోయింది. ఓ వ్యక్తిపై దాడి కేసులో తనపై కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని వాపోయింది. తప్పుడు కేసులు పెట్టి తనను ఇబ్బంది […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ పాలనలో అవినీతి పెరిగిపోయిందని..అది చూడలేకే తాను వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు శివశ్రీ అనే యువతి స్పష్టం చేసింది. గుంటూరు జిల్లా తాడేపల్లి అమరారెడ్డి కాలనీకి చెందిన ఆమె నిర్వాసితుల కోసం ఇటీవలే పవన్ కళ్యాణ్‌ను కలిసింది. పవన్ కల్యాణ్‌ను కలిసినప్పటి నుంచి పోలీసులు తనను వేధించారని వాపోయింది. ఓ వ్యక్తిపై దాడి కేసులో తనపై కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని వాపోయింది.
తప్పుడు కేసులు పెట్టి తనను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించింది. ఇప్పటికే పోలీసులు తనను రెండుసార్లు అదుపులోకి తీసుకున్నారని రాజకీయ పార్టీల నేతలు, గ్రామస్థులు వచ్చి నిరసన చేపట్టడంతో విడుదల చేశారని స్పష్టం చేసింది. సీఎం నివాసం పక్కనే ఉంటున్న తననే ఇలాంటి ఇబ్బందులకు గురి చేస్తే.. రాష్ట్రంలోని మిగతా మహిళల పరిస్థితి ఏంటని శివశ్రీ ప్రశ్నించింది.
- Tags
- case
- Pawan Kalyan
Next Story






