- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేంద్రానికి సింగరేణి కార్మికుల వార్నింగ్
<p>దిశ, తాండూర్: సింగరేణిలో ఈ నెల 9,10,11 తేదీలలో జరిగే సమ్మెను కార్మికులు విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, గుణపాఠం చెప్పాలని సింగరేణి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం అబ్బాపూర్ బీపీఏ ఓసీపీ-2 లో గేట్ మీటింగ్ నిర్వహించారు. సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటికరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు ఇచ్చే నోటిఫికేషన్ వెంటనే రద్దు చేసి, ఆ బావులను సింగరేణికి యథావిథిగా […]</p>

దిశ, తాండూర్: సింగరేణిలో ఈ నెల 9,10,11 తేదీలలో జరిగే సమ్మెను కార్మికులు విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి, గుణపాఠం చెప్పాలని సింగరేణి జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో శనివారం అబ్బాపూర్ బీపీఏ ఓసీపీ-2 లో గేట్ మీటింగ్ నిర్వహించారు. సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల ప్రైవేటికరణను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణకు ఇచ్చే నోటిఫికేషన్ వెంటనే రద్దు చేసి, ఆ బావులను సింగరేణికి యథావిథిగా ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో పోరాటాలు, ఆందోళనలు చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్, హెచ్ఎంఎస్ (జేఏసీ) నాయకులు శ్రీనివాస్, ప్రకాష్ రావు, తిరుపతి, సత్తయ్య, కృష్ణ మోహన్, శేషు, బయ్య మొగిలి, కోటేశ్వర్, రెడ్డి, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- central govt






