- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈటలను కలిసిన సిద్దిపేట నేతలు.. రాజకీయ పరిస్థితులపై చర్చ
<p>దిశ, సిద్దిపేట: సిద్దిపేట బీజేపీ నాయకులు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారాన్ని ఎండగట్టి విజయఢంకా మోగించిన ఈటలను శామీర్‌పేటలోని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఈటలతో సిద్దిపేట రూరల్ మండల ఇన్‌చార్జి తోడుపునూరి వెంకటేశం సుమారు అరగంట పాటు చర్చించారు. సిద్దిపేట రాజకీయ పరిస్థితులు, సమస్యలపై ఈటలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా వికలాంగుల సెల్ కన్వీనర్ బొల్లవేణి […]</p>

X
దిశ, సిద్దిపేట: సిద్దిపేట బీజేపీ నాయకులు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారాన్ని ఎండగట్టి విజయఢంకా మోగించిన ఈటలను శామీర్‌పేటలోని ఆయన నివాసంలో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఈటలతో సిద్దిపేట రూరల్ మండల ఇన్‌చార్జి తోడుపునూరి వెంకటేశం సుమారు అరగంట పాటు చర్చించారు. సిద్దిపేట రాజకీయ పరిస్థితులు, సమస్యలపై ఈటలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా వికలాంగుల సెల్ కన్వీనర్ బొల్లవేణి యాదగిరి, సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






