మహిళతో ఎస్ఐ రాసలీలలు.. రాత్రి భర్త ఇంటికి వచ్చేసరికి సీన్ రివర్స్

1058

దిశప్రతినిధి, మహబూబ్ నగర్: ఓ వివాహితతో ఇల్లీగల్ ఎఫైర్ నడుపుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికి ఆ వివాహిత భర్త చేతిలో చావు దెబ్బలు తిన్న ఎస్‌ఐ‌కి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తోంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ‌గా పనిచేస్తున్న షేక్ షఫీ కొత్తకోట‌కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన చుట్టుపక్కల వారు కొందరు ఆ మహిళ భర్తకు తెలిపారు. అతను ఈ విషయాన్ని తెలుసుకుని తన భార్యకు, ఎస్ఐకి.. ధోరణి మార్చుకోవాలని పలు మార్లు సూచనలు చేశాడు. జిల్లా ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయినప్పటికిని వారి ధోరణిలో మార్పు లేదని గమనించాడు.

ఈనెల 18వ తేదీన తాను పనిపై ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నానని, రెండు మూడు రోజుల వరకు రాను అని చెప్పి బయటకు వెళ్ళాడు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం తన ఇంటి దగ్గర జరిగే వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అదే రోజు రాత్రి ఎస్‌ఐ‌కి ఆ మహిళ ఫోన్ చేయడంతో ఎస్ఐ ఇంటికి చేరుకున్నాడు. వారిరువురు ఇంట్లో ఉండగా ప్రణాళిక ప్రకారం ఆ మహిళ భర్త, మరి కొందరితో కలిసి ఇంట్లోకి చేరి ఇరువురిని చితకబాదారు. విషయం తెలుసుకున్న కొత్తకోట పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ ఎస్‌ఐ‌ని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన పోలీసులు వివరాలను ఉన్నతాధికారులకు చేరవేశారు. దీనితో ఎస్‌ఐ‌ని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.