శ్రుతి‌హాసన్‌ డైరెక్షన్‌లో కమల్?

by  |
kamal hasan shruti hasan
X

దిశ, సినిమా : మల్టీ టాలెంటెడ్ హీరోయిన్ శ్రుతి హాసన్.. ఓ వైపు మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తూనే, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు సింగర్ కమ్ మ్యూజీషియన్‌గా ప్రైవేట్ పాప్ ఆల్బమ్స్‌తోనూ సత్తా చాటుతోంది. ఇటీవలే టాలీవుడ్‌లో ‘క్రాక్’ సినిమాతో హిట్ అందుకున్న శ్రుతి.. పవర్‌స్టార్‌తో నటించిన ‘వకీల్ సాబ్’తో వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘సలార్’ షూటింగ్‌లో పాల్గొంటున్న హీరోయిన్.. త్వరలోనే మెగాఫోన్ పట్టనుందని, అందుకే ఇటీవల నిర్మాతగా కూడా మారిందని కోలీవుడ్ వర్గాల టాక్.

గతంలోనే స్క్రిప్ట్ రైటింగ్‌లో మెళకువలను నేర్చుకున్న శృతి హాసన్, ప్రస్తుతం డైరెక్షన్‌పై పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. ఈ మేరకు తన ఫస్ట్ సినిమాను తండ్రి కమల్ హాసన్‌తోనే తెరకెక్కిస్తుందా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే హీరోయిన్‌గా చేతినిండా సినిమాలున్న టైమ్‌లో డైరెక్షన్ వైపునకు మళ్లితే, ఆఫర్స్ తగ్గే చాన్స్ ఉందనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. మరి శ్రుతి‌హాసన్ నిజంగానే డైరెక్టర్‌గా మారబోతుందా? లేదా? తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Next Story

Most Viewed