ఆ హీరో నాకు స్పెషల్ : శ్రుతి హాసన్

by  |
sruthi.jpg
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రుతి హాసన్.. వెండితెరపైనే కాదు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైనా సత్తా చాటుతోంది. ఓ వైపు మెయిన్ స్ట్రీమ్ మూవీస్ చేస్తూనే, మరోవైపు డిజిటల్ సిరీస్‌ల్లో నటిస్తోంది. తెలుగులో ఇటీవలే ‘క్రాక్’ మూవీతో సక్సెస్ అందుకున్న శ్రుతి.. ఇందులో ప్లే చేసిన సూపర్ ఉమన్ రోల్‌తో ఆడియన్స్‌ను అలరించింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ‘వకీల్‌సాబ్’, ప్రభాస్ ‘సలార్’ చిత్రాలతో పాటు నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ‘పిట్టకథలు’లోనూ నటిస్తోంది. కాగా, టాలీవుడ్ హీరోలతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది శ్రుతి. బన్నీ వృత్తి పట్ల అంకితభావంతో ఉంటాడని తెలిపిన ఈ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్.. రవితేజతో ‘బలుపు, క్రాక్’ సినిమాలు చేశానని, ఆయన తనకు చాలా స్పెషల్ అని చెప్పింది. తన హృదయంలో రవితేజకు ప్రత్యేక స్థానం ఉందని తెలిపింది. మహేశ్ బాబు ఎప్పుడూ ఉత్సాహంగా ఉంటారని, ఆయనతో కలిసి పనిచేసినందుకు గర్వంగా ఫీలవుతున్నానని చెప్పుకొచ్చింది. కాగా త్వరలోనే తను ప్రభాస్ ‘సలార్’ షూటింగ్ షెడ్యూల్‌లో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed