‘లాభం’తో శ్రుతికి లాభమే!

by  |
‘లాభం’తో శ్రుతికి లాభమే!
X

హీరోయిన్ శ్రుతి హాసన్ గురించి చెప్పాలంటే.. మంచి సింగర్, టాలెంటెడ్ యాక్టర్, సూపర్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ డాన్సర్ కూడా. ఈ మధ్యే ‘ఎడ్జ్’ ఆల్బమ్‌తో బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకున్న ఈ మల్టీ టాలెంటెడ్ బ్యూటీ.. తన నెక్స్ట్ సినిమాలో డాన్సింగ్ స్కిల్స్ చూపించబోతుందట. విజయ్ సేతుపతి హీరోగా ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో వస్తున్న తమిళ సినిమాలో నృత్య కళాకారిణిగా ఆకట్టుకోనుందని టాక్.

సినిమా టైటిల్ ‘లాభం’ ఇప్పటికే ఖరారు కాగా, ఈ చిత్రంలో విజయ్ సేవా కార్యక్రమాలు చూసి డ్యాన్సర్ అయిన శ్రుతి ప్రేమలో పడుతుందని సమాచారం. సంఘసేవ చేసే విజయ్ శ్రుతి ప్రేమను స్వీకరిస్తాడా? ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అన్నదే సినిమా కథ. కాగా, కీలక పాత్రలో కనిపించబోతున్న జగపతి బాబు నెగెటివ్ షేడ్స్ తెరపై ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయని తెలుస్తోంది. డి. ఇమాన్ సంగీత దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా స్ట్రాంగ్ సోషల్ మెసేజ్‌తో వస్తుండగా.. విజయ్ ఈ చిత్రానికి డబ్బింగ్ కూడా చెప్పేశాడు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుందనే విషయంపై త్వరలోనే వివరాలు వెల్లడించనుంది మూవీ యూనిట్.

Next Story

Most Viewed