శ్రుతిహాసన్ డిమాండ్‌కి ‘సలార్’ టీం ఓకే

by  |
sruthi.jpg
X

దిశ, సినిమా: ‘క్రాక్’ హిట్‌తో శ్రుతి హాసన్ డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. సూపర్ ఉమన్‌గా ‘క్రాక్’ ద్వారా బెస్ట్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్న భామ.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వస్తున్న ‘సలార్‌’లో గ్రేట్ చాన్స్ కొట్టేసింది. ఇంతవరకు సినిమాకు రూ.50 లక్షలు మాత్రమే డిమాండ్ చేసిన ఈ చిత్రానికి ఏకంగా రూ. 2 కోట్లు డిమాండ్ చేసిందని సమాచారం. శ్రుతి డేట్స్ సినిమాకు కచ్చితంగా అవసరం కావడంతో తన డిమాండ్‌ను ఓకే చేశారని సమాచారం. ప్రస్తుతం తెలంగాణ బొగ్గుగనుల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘సలార్’ ఏకకాలంలో తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. హోంబలె ఫిల్మ్స్ నిర్మిస్తున్న సినిమాలో ప్రభాస్ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తుండగా.. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి.


Next Story

Most Viewed