ఇన్‌స్టాగ్రామ్‌లో సాహో బ్యూటీ రికార్డ్..

by  |
Shraddha Kapoor
X

దిశ, సినిమా : ‘సాహో’ బ్యూటీ శ్రద్ధా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఫిల్మ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా సరే, తనకు తానుగా స్పెషల్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న బ్యూటీ.. చిన్న సినిమాలతో కెరియర్ స్టార్ట్ చేసి బిగ్ బడ్జెట్ మూవీస్‌లో మెయిన్ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా తనకు ఎన్నో అభిమాన సంఘాలు ఉండగా.. సోషల్ మీడియాలో తనకున్న ఫాలోయింగ్, కోస్టార్స్‌‌ను కూడా జెలస్ ఫీల్ అయ్యేలా చేస్తుంది.

ఈ మేరకు హాలీవుడ్ స్టార్స్, పాప్ సింగర్స్ కూడా రీచ్ కాని బిగ్ మైల్ స్టోన్‌ను హిట్ చేసేసింది. కేవలం కొందరు సెలబ్రిటీలు మాత్రమే ఇన్‌స్టాగ్రామ్‌లో 60 మిలియన్ ఫాలోవర్స్‌తో ఉండగా, ఇప్పుడు శ్రద్ధ కూడా ఆ లిస్ట్‌లో చేరిపోయింది. ఈ సందర్భంగా థాంక్స్ నోట్ షేర్ చేసిన శ్రద్ధ.. అభిమానుల అపరిమిత ప్రేమకు ధన్యవాదాలు తెలిపింది. ఫ్యాన్ క్లబ్స్‌ను స్వీటెస్ట్ బడ్డీస్‌గా అభివర్ణిస్తూ.. తాను ఇప్పుడు అందరికంటే లవ్‌లీయెస్ట్‌గా కనిపిస్తున్నానని ఆనందపడిపోయింది.


Next Story