ఇదే చివరి హెచ్చరిక : శ్రద్ధా దాస్

by  |
ఇదే చివరి హెచ్చరిక : శ్రద్ధా దాస్
X

హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్.. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సూపర్ హాట్ హీరోయిన్ అనిపించుకుంది. కెరియర్ ప్రారంభం నుంచి గ్లామరస్ పాత్రల వైపే మొగ్గు చూపిన భామ.. సోషల్ మీడియాలోనూ హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంది. తను అనుకున్న విషయాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేసే శ్రధ్ధ.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 గురించి ఫైర్ అయింది.

బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ కావడంతో కంటె‌స్టెంట్‌ల గురించి సోషల్ మీడియాలో అనేక మంది సెలెబ్రిటీల పేర్లు వినిపిస్తున్నాయి. వీటిలో శ్రద్ధ పేరు ముందుండటంతో తను ఆ షోలో పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చింది. అసలు బిగ్ బాస్ నిర్వాహకులు తనను అప్రోచ్ అవలేదని.. తను అందులో భాగస్వామ్యం కాలేదని చెప్పింది. చాలా మంది నుంచి ఈ విషయం గురించి మెసేజ్‌లు, కాల్స్ వస్తున్నాయని.. క్లారిటీ ఇచ్చినా సరే కొన్ని మీడియా సంస్థలు అదే న్యూస్ ప్రచారం చేస్తున్నాయని మండిపడింది. ఇది ఇలాగే కొనసాగితే లీగల్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది శ్రద్ధ. ఇదే లాస్ట్ టైమ్ అని.. రిపీట్ అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిపింది.

https://twitter.com/shraddhadas43/status/1287429869182373889?s=19

Next Story

Most Viewed