- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుట్టిన రోజున "దొరసాని" విరాళం
<p>శివాత్మిక… జీవిత రాజశేఖర్ ల ముద్దుల కూతురు. దొరసాని సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక తొలి చిత్రంతోనే మెరుగైన నటనతో ప్రశంసలు అందుకుంది. దొరసాని గా వంద మార్కులు కొట్టేసింది. అభినయం, ఆహార్యం, అందం కలబోసిన తెలుగు అమ్మాయిగా విమర్శకులను మెప్పించింది. సినిమా రిలీజ్ కు ముందు కూరగాయలు అమ్ముకునే దానిలా ఉందని కామెంట్స్ చేసిన వారితోనే … అందానికి చిరునామగా… దొరసాని అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా ఉందని కాంప్లిమెంట్స్ ఇచ్చేలా చేసింది. దొరసాని […]</p>

శివాత్మిక… జీవిత రాజశేఖర్ ల ముద్దుల కూతురు. దొరసాని సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక తొలి చిత్రంతోనే మెరుగైన నటనతో ప్రశంసలు అందుకుంది. దొరసాని గా వంద మార్కులు కొట్టేసింది. అభినయం, ఆహార్యం, అందం కలబోసిన తెలుగు అమ్మాయిగా విమర్శకులను మెప్పించింది. సినిమా రిలీజ్ కు ముందు కూరగాయలు అమ్ముకునే దానిలా ఉందని కామెంట్స్ చేసిన వారితోనే … అందానికి చిరునామగా… దొరసాని అనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా ఉందని కాంప్లిమెంట్స్ ఇచ్చేలా చేసింది.
దొరసాని సినిమాలో అన్నీ ఉండి స్వేచ్చ లేని అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమలో పడితే .. ఆ ఆలోచనలు ఆమెకు ఎంత ఆనందాన్ని ఇస్తాయి… తనకోసం ఎంతటి యుద్ధం చేస్తుంది.. అనేది కథ కాగా… ఆ రూపం, ఆ నటనలో పరిణితి తో .. అసలు ఇక్కడ కూడా ఇది తనకు తొలి సినిమానేనా అన్న ఆలోచన కూడా రాదు. అంత గొప్పగా నటించింది.
కాగా మంగళవారం పుట్టినరోజు జరుపుకుంటున్న శివాత్మిక సోదరి శివానితో కలిసి ముందుగా ప్రకటించినట్లుగా… తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 2 లక్షల విలువైన చెక్కును విరాళంగా అందించింది. మంత్రి కేటీఆర్ ను కలిసిన ఇద్దరు అక్కా చెల్లెళ్లు తమ సహాయాన్ని అందించారు.
.@ActorRajasekhar‘s Daughters @Rshivani_1 @ShivathmikaR Contributes Rs 2 Lakhs for Telangana CM Relief fund to fight #CoronavirusPandemic @TelanganaCMO @KTRTRS#LetsFightCoronaTogether #StayHome #StaySafe pic.twitter.com/8X1pHdDPvF
— BARaju (@baraju_SuperHit) April 22, 2020
Tags: Shivathmika, shivani, Rajashekar, Jeevitha, Dorasani, Birthday, Donation, CMRF






