ఉపాధ్యాయుడిపై షీ టీమ్ కేసు నమోదు.. భార్యతో కాకుండా మరొకరితో..

by  |
Shea team case
X

దిశ, వెబ్‌డెస్క్ :పెళ్లంటే నూరేళ్ళ పంట.. ఒకరితో ఏడడుగులు వేశాక అతడే ఆమెకు అన్నీ… ఎన్ని తిట్టినా, కొట్టినా భర్తే ఆమె సర్వసం. కానీ, ఆ భర్త, భార్యను పట్టించుకోకుండా మరో మహిళతో సంబంధం పెట్టుకుంటే.. అదేంటి అని వారించాల్సిన అత్తా మామలే.. కొడుకుకు సపోర్ట్ చేస్తే ఆ భార్య పరిస్థితి ఏంటి..? కన్నకూతురిలా చూసుకొంటామని తీసుకొచ్చి ఇంట్లో చిత్రహింసలకు గురిచేస్తూ, అధిక కట్నం కోసం వేధిస్తుంటే.. ఆ మహిళ వేదన వర్ణనాతీతం. అందులోనూ ఆ భర్త ఎంతోమంది విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పే టీచర్.. అయినా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాకుండా.. భార్యను వరకట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్న ఓ టీచర్ బాగోతం నల్లగొండ జిలాల్లో వెలుగు చూసింది.భార్య స్రవంతి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణానికి చెందిన స్రవంతిని సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మర బండపాలెం గ్రామానికి చెందిన నాగార్జునపు రామలింగాచారితో ఏడేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఓ కుమారుడు. రామలింగాచారి నేరేడుచర్లలో నివాసం ఉంటూ గడ్డిపల్లి మోడల్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే పెళ్లైన నాటి నుంచి రామలింగాచారి భార్యను మానసికంగా, శారీరకంగా వేధించడంతోపాటు నిత్యం హింసించేవాడు. సంసారం చేయకుండా నిత్యం గొడవ పడుతూ ఉండే వాడు. ఆరు నెలలకు ఓసారి ఇంటికి వచ్చి పదిరోజులు ఉండి గొడవ పడి మళ్లీ వెళ్లిపోయేవాడు.

ఇదే విషయాన్ని భార్య స్రవంతి అత్తామామలకు తెలిపింది. దీంతో వాళ్లు కొడుకును మందలించాల్సిందిపోయి.. అతడికే సపోర్ట్ పలుకుతూ మరో రూ.10 లక్షలు అదనపు కట్నం తెస్తేనే నీ భర్త నీతో సంసారం చేస్తాడని తేల్చి చెప్పేశారు. అనంతరం ఆమెను ఇంట్లోనే బంధించి భర్తతో చిత్రహింసలకు గురి చేయించారు. ఇలా గొడవలు జరుగుతున్న క్రమంలో వారికి ఓ బాబు జన్మించాడు. అయినా వారిలో మార్పు రాలేదు. దీనిపై స్రవంతి తల్లిదండ్రులు పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు నిర్వహించినా ఫలితం లేకపోయింది.

అయినా భర్త మారుతాడనే ఉద్దేశ్యంతో ఉన్న స్రవంతికి షాకింగ్ నిజం తెలిసింది. ఆమె భర్త రామలింగాచారి మరో మహిళలో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు భర్త ఫోన్ చాటింగ్ ద్వారా తెలుసుకుంది. దీనిపై ప్రశ్నించినా ఆమెకు వేధింపులు దక్కాయి. అయితే తనను, తన కుమారుడిని చంపేసి, పెళ్లి చేసుకుంటానని రామలింగాచారి ఆ మహిళకు మెసేజ్‌లు పెట్టాడు. దీనిపై భయాందోళన చెందిన స్రవంతి భర్త రామలింగాచారి, మామ వెంకటాచారి, అత్త సీత, మరిది సాయికృష్ణపై నల్లగొండ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్త అక్రమ సంబంధం పెట్టుకోవడంతోపాటు నన్ను, నా కుమారుడిని చంపడానికి ప్రయత్నిస్తున్నాడని, అదనపు కట్నం కోసం భర్తతోపాటు అత్తమామ, మరిది వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నది. తనకు రక్షణ కల్పించడంతోపాటు న్యాయం చేయాలని కోరింది. స్రవంతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ నాగలక్ష్మి కేసు నమోదు చేశారు.


Next Story

Most Viewed