బిగ్ బ్రేకింగ్: ఘటనా స్థలంలోనే షర్మిల నిరాహార దీక్ష..

by  |
బిగ్ బ్రేకింగ్: ఘటనా స్థలంలోనే షర్మిల నిరాహార దీక్ష..
X

దిశ, ఎల్బీనగర్: “ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అమానుష ఘటనపై సీఎం స్పందించే వరకు ఇక్కడే కూర్చుంటా, వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి 10 కోట్లు ప్రకటించాలి. నిందితుడికి ఉరిశిక్ష వేయిస్తారా..? ఎన్ కౌంటర్ చేస్తారా..? ఏదైనా వెంటనే చేయాలి. మీ ఇంట్లో కుక్క పిల్లలు చనిపోతే అధికారులపై చర్యలు తీసుకున్నారు. అభం శుభం తెలియని చిన్నారులు ప్రాణాలు పోతే నీలో చలనం లేదు. నీకు మానవత్వం లేదా” అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బుధవారం సింగరేణి కాలనీలోని బాధిత కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఘటన జరిగి ఇన్ని రోజులు గడిచినా ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గిరిజన బిడ్డ ప్రాణాలకు మీ దృష్టిలో విలువ ఉండదా అని ప్రశ్నించారు. అన్ని శాఖలను తానే నడిపే సీఎం కుమారుడు కేటీఆర్ ఒక సారి నిందితుడిని గంటల్లో పట్టుకున్నమంటారు, మరోసారి ఇంకా పట్టుకోలేదంటారు.. ఇది బాధ్యతారాహిత్యం కాదా అని ప్రశ్నించారు.

మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్న కాలనీలోనే ఘటన జరిగితే బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించడం లేదన్నారు. సింగరేణి కాలనీలో మద్యం, గుడుంబా ఏరులై పారుతున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. కేటీఆర్ దత్తత తీసుకున్న కాలనీలోనే ఇన్ని సమస్యలు ఉంటే ఇక రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదా బంగారు తెలంగాణ అంటే అని విమర్శించారు. ఇది బంగారు తెలంగాణ కాదని ఆత్మహత్యల తెలంగాణ, అప్పుల తెలంగాణగా మార్చారని అన్నారు. చిన్నారి ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించే వరకు ఇక్కడే నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించిన ఆమె వెంటనే బాధిత కుటుంబానికి 10 కోట్ల రూపాయలు ప్రకటించి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

బిగ్ బ్రేకింగ్ : ఏపీ సీఎం జగన్ కు సీబీఐ కోర్టులో భారీ ఊరట..ఎంపీ రఘురామకృష్ణకు బిగ్ షాక్… వైసీపీ అభిమానుల్లో ఫుల్ జోష్


Next Story

Most Viewed