బాలీవుడ్‌లో మరో డర్టీ పిక్చర్

by  |
బాలీవుడ్‌లో మరో డర్టీ పిక్చర్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్‌లో మరో డర్టీ పిక్చర్ రిలీజ్ కాబోతుంది. సిల్క్ స్మిత జీవితకథ ఆధారంగా గతంలో తెరకెక్కిన ‘డర్టీ పిక్చర్‌’లో విద్యాబాలన్ నటించగా ఆ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. బోల్డ్‌గా తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించగా.. అంతే బోల్డ్‌నెస్‌తో వచ్చేస్తోంది ‘షకీలా’. హాట్ గర్ల్ రిచా చద్దా ఈ మూవీలో అడల్ట్ స్టార్ షకీలా పాత్ర ప్లే చేయగా.. లేటెస్ట్‌గా రిలీజైన టీజర్ హాట్ హాట్‌గా ఉంది. షకీలా స్టార్‌డమ్, పాపులారిటీని వివరిస్తూ టీజర్ స్టార్ట్ కాగా, కరోనా లాంటి టైమ్స్‌లోనూ అమేజింగ్ ఎంటర్‌టైన్మెంట్ రెడీ చేశామని.. ఆడియన్స్ థియేటర్‌కు వచ్చి షకీలాను మరోసారి గుర్తుచేసుకోవాలని ఆఫర్ ఇస్తున్నారు. షకీలాగా రిచా సూపర్ హాట్ అవతార్‌లో కనిపించగా.. పంకజ్ త్రిపాఠి ప్రధానపాత్రలో కనిపించబోతున్నారు. ఇంద్రజిత్ లంకేశ్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాను సామి నన్వాని నిర్మించగా.. మీట్ బ్రదర్స్ అండ్ వీర్ సమర్థ్ మ్యూజిక్ అందించారు. కాగా డిసెంబర్ 25న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.


Next Story

Most Viewed