వెయ్యి థియేటర్లలో ‘షకీలా’ బయోపిక్!

by  |
వెయ్యి థియేటర్లలో ‘షకీలా’ బయోపిక్!
X

దిశ, వెబ్‌డెస్క్: మల్లూవుడ్ శృంగార తార షకీలాను సూపర్ స్టార్‌గా చూపిస్తూ తెరకెక్కుతున్న బయోపిక్ ‘షకీలా’. బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా టైటిల్ రోల్ ప్లే చేస్తున్న సినిమా ట్రైలర్‌కు బెస్ట్ రెస్పాన్స్ రాగా.. సినిమాను దేశవ్యాప్తంగా 1000 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు ఫిల్మ్ మేకర్స్. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కాబోతున్న చిత్రం ప్రేమ, నిబద్ధతో కూడిన శ్రమ అని.. షకీలా చాలా రకాలుగా ఐకానిక్ అని చూపేలా సినిమా సాగుతుందన్నారు. ఆమె కథ దాదాపు అందరికీ తెలిసిన జానపద కథే అయినా.. తను ఎదిగే క్రమంలో ఏం జరిగింది? తన సినిమా రిలీజ్ అవుతుందంటే స్టార్స్ కూడా తమ సినిమాల విడుదలను ఆపుకునేంత క్రేజ్ తెచ్చుకున్న తను.. తర్వాత ఎందుకు సక్సెస్ కాలేకపోయింది అనేదే కథ. కాగా కరోనా తర్వాత ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే సినిమా షకీలానే అవుతుందని నమ్మకంతో ఉన్నట్లు తెలిపారు మేకర్స్. కాగా సామీస్ మ్యాజిక్ సినిమా మోషన్ పిక్చర్ నిర్మించిన ‘షకీలా’ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.


Next Story

Most Viewed