ఆర్యన్ ఖాన్ అరెస్టుకు షారుఖే కారణం.. నటుడి కామెంట్స్

161
Sharook-1

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ యాక్టర్ శత్రుఘ్న సిన్హా.. షారుఖ్ కొడుకు ఆర్యన్ ఖాన్ అరెస్టుపై రీసెంట్‌గా స్పందించాడు. క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ పట్ల వ్యవహరిస్తున్న తీరును విమర్శించిన ఆయన.. అతడు షారుఖ్ కుమారుడు కాబట్టే లక్ష్యంగా చేసుకుంటున్నారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ఇక్కడ మత ప్రస్తావన తీసుకురావడం ఎంత మాత్రం సరికాదు. రాజ్యాంగం ప్రకారం భారతీయులంతా సమానమే. ఇక ఈ కేసులో మున్మున్ ధమేచా, అర్బాజ్ మర్చంట్ వంటి ప్రముఖులు ఉన్నా.. వారి గురించి మాట్లాడటం లేదు. అంటే ఆర్యన్‌ను టార్గెట్ చేయడానికి ఖచ్చితంగా షారుఖే కారణమని స్పష్టమవుతోంది’ అని వెల్లడించారు.

గతంలో దీపికా పదుకొనే విషయంలోనూ ఇలాగే జరిగిందని, ఓ కేసుకు సంబంధించి ఇతర ప్రముఖుల పేర్లు ఉన్నప్పటికీ దీపికపైనే ఫోకస్ చేశారని అన్నారు. ఇక సినిమా ఇండస్ట్రీని ‘భయపడే వ్యక్తుల సమూహం’గా పోల్చిన సిన్హా.. అందరూ ఇది తమ సమస్య కాదని భావిస్తున్నందున షారుఖ్‌కు మద్దతు తెలిపేందుకు ముందుకు రావాలని అనుకోవడం లేదని తెలిపారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..