- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎవరిదీ లోపం.. మగవాళ్లలో పిల్లలు పుట్టక పోవడానికి కారణాలు ఏంటో చెబుతారా ?
పెళ్లి అయ్యి నాలుగేళ్లు. పిల్లలు ఇంకా పుట్టలేదు

దిశ, ఫీచర్స్:
మేడం.. మా పెళ్లి అయ్యి నాలుగేళ్లు. పిల్లలు ఇంకా పుట్టలేదు. నా వైపు ఏ లోపము లేదని డాక్టర్లు చెబుతున్నారు. మా వారు పరీక్షలకి రావడం లేదు. నాకే లోపం లేదు అంటున్నారు. మా అత్త, మామ కూడా ఆయన్నే సమర్థిస్తున్నారు. మా వారు అసలు ఎక్కువగా సెక్స్ లోనే పాల్గొనరు. ఆసక్తి లేదంటారు. మగవాళ్లలో పిల్లలు పుట్టక పోవడానికి కారణాలు ఏంటో చెబుతారా ?
- సువర్ణ, ఖమ్మం
జవాబు : పురుషుల్లో వంద్యత్వానికి కారణాలు : కలయిక జరగకపోవడం. పెళ్లయినా ఒక్కసారి కూడా శృంగారంలో పాల్గొనకపోవడం వల్ల కొన్నిసార్లు ఐదు శాతం మందికి వంద్యత్వం వచ్చే అవకాశం ఉందని సెక్సాలజిస్ట్ జెఫ్ కాక్ చెప్పాడు. 15 సంవత్సరాల తర్వాత కూడా శారీరక, హార్మోన్ల లోపాలు ఏమీ లేకపోయినా మానసిక వంధ్యత్వం వల్ల కూడా పిల్లలు కలగని వాళ్లు ఉంటారు.
పురుషుల వైపు నుంచి శృంగార లోపాలు :
- ప్రాథమిక ద్వితీయ కారణాలతో అంగస్తంభన లోపాలు, వీర్య స్ఖలన లోపాలు.
- ఇంటర్ కోర్స్ కంటే ముందే వీర్యం వేజైనా నుంచి బయట స్ఖలించబడడం. మనసులో తీవ్రమైన ఆందోళన కారణంగా వంధ్యత్వం వస్తుందని చెప్పవచ్చు.
- అంగస్తంభన వచ్చినప్పటికీ వీర్యం స్కలించకపోవడం కూడా దీనికి కారణం. పురుషులు స్త్రీకి గర్భం వస్తుందేమోనన్న భయం లేదా భార్యపై ప్రదర్శించే ఒక రకమైన తిరస్కార ధోరణిగా చెప్పవచ్చు.
- వీర్యస్ఖలనం కాకుండా తిరిగి మూత్రాశయంలోకి వెళ్లిపోవడం, మూత్రం ద్వారా వీర్యం బయటకు వెళ్లిపోవడం కూడా ఒక కారణం. అనేక సార్లు హస్త ప్రయోగం చేయడం వల్ల కూడా వీర్యం పలుచబడి వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది.
- వీర్య కణాలులేని అజూ స్పెర్మియా అనే స్థితి, వరిబీజము, హైడ్రోసిల్,సెక్స్ హార్మోన్లు టెస్టోస్టీరాన్ లోపం కూడా వంధ్యత్వానికి దారి తీస్తుంది, టెస్టిక్యులర్ టోర్షన్, వీర్య నాళాలు ముసుకు పోవడం, జెనెటిక్ కారణాలు, జననాంగాల్లో ఇన్ఫెక్షన్, వాపు, కొన్ని మందులు, సర్జరీలు కూడా కారణం అవుతాయి.
- మగ వాళ్లపై సెక్స్ చేయడానికి ఆసక్తి కలిగి ఉండడం కూడా కారణమే.
- తీవ్రమైన మానసిక అంగ స్థంభన లోపం, భయాందోళనలు, వ్యక్తిత్వలోపాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
కాబట్టి మీరు మీవారు సరిగ్గా పరీక్షలు చేయించుకుంటేనే కాపురం చేస్తానని చెప్పండి. మీ పెద్దవాళ్లతో చెప్పించండి. మీ పుట్టింటి వాళ్లకీ చెప్పేయండి. మీకు తెలిసిన హాస్పిటల్లో మీకు తెలిసిన డాక్టర్లతో మీ వారికి పరీక్షలు చేయించండి.
- డాక్టర్ భారతి
సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్
ప్రీ & పోస్ట్ మేరేజ్ &
సెక్సువల్ కౌన్సెలింగ్
86885 ౧౯౨౨౫
READ MORE ......
కొడుకు పుత్తడి.. కూతురేమో ఇత్తడా.?!






