- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అయ్యో.. వీర్యం పోతోంది.. నాకేమైంది?
అయ్యో.. వీర్యం పోతోంది.. నాకేమైంది?

దిశ, ఫీచర్స్ : దంపతుల మధ్య అన్యోన్య జీవితానికే కాదు, మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా శృంగారం అవసరం. అయితే ఈ విషయంలో సరైన అవగాహనలేకపోవడంతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారికి ప్రముఖ సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్, డాక్టర్ భారతి ఇస్తున్న సలహాలు, సూచనలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రశ్న : మేడం.. నాకు మూత్రంలో వీర్యం పోతుంది. అసలు నా సమస్య ఏంటి? భవిష్యత్తులో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ?
- ఆర్.జే., కరీంనగర్
జవాబు : ఇది పురుషుల్లో వచ్చే ఒక రకమైన లైంగిక సమస్య. దీన్ని ‘రెట్రో గ్రేడ్ ఎజాక్యులేషన్’ అంటారు. స్కలన ద్రవం లేదా వీర్యం మామూలుగా భావప్రాప్తి పొందే సమయంలో పురుషాంగం నుంచి బయటకు వస్తుంది. కానీ కొన్నిసార్లు అది దారి మార్చుకొని వెనక్కి మూత్రాశయంలోకి వెళ్లిపోయి, మూత్రం విసర్జన సమయంలో బయటకు వస్తుంది. పిల్లలు కనేదాకా శృంగార జీవితంలో దీని వల్ల సమస్య రాదు. కానీ పిల్లల్ని కనాలనుకున్నప్పుడు ఇది సమస్య అవుతుంది. కొన్నిసార్లు ఈ స్థితి పూర్తిగా లేదా పాక్షికంగా జరగవచ్చు. అంగం నుంచి సగం బయటకు, మిగతా మూత్రాశయంలోకి కూడా వెళ్లొచ్చు.
కారణాలు, చికిత్స : మూత్రనాళం చివరి కండరాలు బలహీనంగా ఉండడం. డయాబెటిస్ ప్రోస్టేట్ సమస్య, లేదా మూత్ర నాళ సర్జరీ, కొన్ని రకాల మందులు వాడకం ఉదాహరణకి బీపీకి వాడే మందులు వంటి వాటివల్ల కూడా ఈ స్థితి రావచ్చు. షుగర్‌ని నియంత్రించుకోవడం వల్ల కొంతవరకు ఉపకరిస్తుంది. కెగెల్స్ ఎక్సర్సైజ్ చేయడం మంచిది. మీరు వెంటనే యూరాలజిస్ట్‌ని సంప్రదించండి.
- డాక్టర్ భారతి
సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్
ప్రీ & పోస్ట్ మేరేజ్ &
సెక్సువల్ కౌన్సెలింగ్
86885 19225






