Romantic life : శృంగారంలో తృప్తిలేదంటూ భర్త టార్చర్.. ! ఆ కారణంతో పరాయి స్త్రీలపై మోజు

by Javid Pasha |   (  Updated:2025-07-04 12:30:08  IST  )

Romantic life : శృంగారంలో తృప్తిలేదంటూ భర్త టార్చర్.. ! ఆ కారణంతో పరాయి స్త్రీలపై మోజు

Romantic life : శృంగారంలో తృప్తిలేదంటూ భర్త టార్చర్.. ! ఆ కారణంతో పరాయి స్త్రీలపై మోజు
X

దిశ, ఫీచర్స్ : దంపతుల మధ్య అన్యోన్య జీవితానికే కాదు, మానసిక, శారీరక ఆరోగ్యానికి కూడా శృంగారం అవసరం. అయితే ఈ విషయంలో సరైన అవగాహనలేకపోవడంతో కొందరు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి వారికి ప్రముఖ సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్, డాక్టర్ భారతి ఇస్తున్న సలహాలు, సూచనలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ప్రశ్న: నాకు పెళ్లయి ఐదు సంవత్సరాలు అవుతుంది. మాకు ఒక బాబు. గత సంవత్సరం నుంచి మా వారు నా గురించి చాలా వదులుగా ఉందని, తృప్తి కలగడం లేదని, ఇతర స్త్రీల మీద దృష్టి పోతుందని మానసికంగా హింసిస్తున్నాడు. నాకు ఆయనతో చాలా సందర్భాల్లో ఏమాత్రం ఆనందం కలగనప్పుడు కూడా.. నేను ఆయనకు చెప్పలేదు. సెక్స్ అంటేనే విరక్తిగా ఉంది. ఏం చేయాలో చెప్పగలరు. - గాయత్రి, గుంటూరు.

జవాబు : కలయికలో వేజైనా వదులుగా అవడాన్ని, లేదా ఫీల్ అవటాన్ని LAX VAGINA అంటారు. పిల్లలు పుట్టాక యోని వదులు అవుతుందనడం నిజం కాదు. ప్రసవ సమయాన వ్యాకోచించిన యోని కండరాలు తిరిగి సంకోచించి అదే పట్టుత్వంతో ఉంటాయి. సాధారణంగా ఫోర్ ప్లే తక్కువ చేస్తే స్రావాలు విడుదల అవకుండా కలయిక సరిగా కాదు. చాలామంది పురుషులు సెక్స్ ముందు foreplay ఎక్కువసేపు చేసే ఓపిక లేక భార్యల్ని నిందిస్తారు. ఎక్కువ భార్యాభర్తలు ఇద్దరికీ సెక్స్ సమయంలో స్రావాలు ఎక్కువగా విడుదల అయితే కూడా ఈ సమస్య వస్తుంది. lax vagina ki భార్య మాత్రమే కారణం కాదు.

భర్తకి కూడా ఆ సమయంలో ప్రీ ఎజాక్యులేటరీ స్రావాలు విడుదల అవుతాయి. మీరు ఇద్దరూ ఆ సమయంలో కాటన్ బట్టతో తుడుచుకోవాలి. దీనితో పాటు కండరాల న్ని పటుత్వాన్ని పెంచే కేగే ల్స్ ఎక్సర్సైజ్ చేయండి.పెల్విక్ ఎక్సర్సైజ్ చేయండి. సమస్యని సైంటిఫిక్ గా, మెడికల్ గా అర్థం చేసుకోమని, మిమ్మల్ని ఇలా సతాయించద్దని మీ భర్తకి కచ్చితంగా చెప్పండి . బయటి స్త్రీల మీదకి మనసు పోతుందని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తే ఊరుకోకండి. అది చాలా కుసంస్కారంతో కూడినది అని చెప్పండి.

- డాక్టర్ భారతి

సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ &

సెక్సువల్‌ కౌన్సెలింగ్

86885 19225

Next Story