- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ మూడు రోజులు శృంగారానికి ఒప్పుకోవడం లేదు..! కలిస్తే తప్పేంటి?
నీ భార్య అంటే నీకు అంత ఇష్టమైతే ఆమెకు కష్టం కలిగించే పని చేయద్దు. రుతు సమయంలో శృంగారం కావాలని బలవంత పెట్టడమే తప్పు.

ప్రశ్న: మేడం.. నా వయసు 30 సంవత్సరాలు. నా భార్య వయసు 27. నాలుగు నెలల క్రితం మాకు పెళ్లి జరిగింది. మేమిద్దరం సంతోషంగా శృంగారంలో పాల్గొంటాం. కానీ ఆ మూడు రోజులు తనకు దూరంగా ఉండలేకపోతున్నాను. అప్పుడు కూడా కావాలనిపిస్తుంది. కానీ తను ఒప్పుకోవడం లేదు. ఆ సమయంలో కూడా కలవచ్చని చాలా పుస్తకాల్లో చదివాను. ఆ విషయం తనకు చెప్పినా వినడంలేదు. నాకు కోపం వస్తోంది.. తనకు ఎలా నచ్చ చెప్పాలి. - హరినాథ్, తెనాలి
జవాబు : నీ భార్య అంటే నీకు అంత ఇష్టమైతే ఆమెకు కష్టం కలిగించే పని చేయద్దు. రుతు సమయంలో శృంగారం కావాలని బలవంత పెట్టడమే తప్పు. ఇంకా ఆమె ఒప్పుకోలేదని ఇలా కోప్పడడం ఎంతవరకు న్యాయమో ఆలోచించు. రుతు సమయంలో శృంగారంలో ఏమీ కాదని చదివావని అంటున్నావు.. ఏమీ కానిది మగవాడికి మాత్రమే. ఆడవాళ్లకి ఆ సమయంలో రక్తస్రావంతో పాటు కడుపునొప్పి, నడుము నొప్పి, తీవ్రమైన కాళ్ల నొప్పులు, కొంతమందికి వాంతులు, వికారం, ఒంటి తిమ్మిర్లు కూడా ఉంటాయి. మానసికంగా డిప్రెషన్, ఆందోళన, భయము, చిరాకు ఉంటుంది. ఆకలి వేయదు. ఈ సమయంలో సెక్స్ చేయడం చాలా నేరం. ఒకవేళ పాల్గొంటే అధిక రక్తస్రావం అవుతుంది. పైగా నొప్పులు, చిరాకు ఎక్కువే సహజమైన శృంగారం పైనే ఆసక్తి పోతుంది. అర్థం చేసుకోకుండా నువ్వు వేధిస్తే నీపై ఆమెకు అయిష్టత, కోపం పెరుగుతాయి. మామూలు సమయంలో కూడా నీతో సెక్స్ లో పాల్గొనదు. ఆమె మానసిక స్థితిని అర్థం చేసుకొని నడుచుకోండి. ఆ సమయంలో కూడా సెక్స్ కావాలని వేధిస్తే, బలవంతంగా సెక్స్ చేస్తే అది రేప్ కిందికి వస్తుంది గమనించండి.
ప్రశ్న: మేడం.. నా వయసు 29 సంవత్సరాలు. ప్రస్తుతం కాంపిటీటివ్ ప్రిపేర్ అవుతున్నాను. మరో రెండేళ్లకు పెళ్లి ప్లానింగ్ లో ఉన్నాను. నా ఫ్రెండ్స్ మాత్రం 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే సెక్స్ పరమైన సమస్యలు వస్తాయి అంటున్నారు నిజమేనా ? - గిరిప్రతాప్, వరంగల్
జవాబు : కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యాధికుడివి. నీకు సెక్సువల్ హెల్త్ కి సంబంధించిన జ్ఞానం కొంతైనా ఉండాలి. 30 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకుంటే సెక్స్ సమస్యల రావు. కాకపోతే మరీ చిన్నమ్మాయిని చేసుకోవద్దు. 10, 15 సంవత్సరాల వయసు వ్యత్యాసం వల్ల సెక్స్ సమస్యలు, భావోద్వేగ సమస్యలు వస్తాయి. నీకంటే మూడేండ్లు లేదా ఐదేండ్ల చిన్నమ్మాయిని చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ మాటలను పట్టించుకోకుండా పరీక్షలకు సిద్ధమవ్వు. ఆల్ ది బెస్ట్.
- డాక్టర్ భారతి
సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్
ప్రీ & పోస్ట్ మేరేజ్ &
సెక్సువల్ కౌన్సెలింగ్
86885 19225






