పీరియడ్స్ ఉన్నా వదలట్లేదు.. సెక్స్ చేయాల్సిండేనంటూ సతాయిస్తున్నాడు..!!

by Javid Pasha |   (  Updated:2025-07-12 12:37:06  IST  )

పీరియడ్స్ ఉన్నా వదలట్లేదు.. సెక్స్ చేయాల్సిండేనంటూ సతాయిస్తున్నాడు..!!

పీరియడ్స్ ఉన్నా వదలట్లేదు.. సెక్స్ చేయాల్సిండేనంటూ సతాయిస్తున్నాడు..!!
X

దిశ,ఫీచర్స్ : దాంపత్య జీవితంలో శృంగారం ఒక భాగం. భార్యా భర్తలు సంతోషంగా ఉండాలంటే.. లైంగిక విషయాలపట్ల అవగాహన అవసరం. లేకపోతే అపార్థాలకు, సంసార జీవితంలో సమస్యలకు దారితీయవచ్చు అంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు, సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్ డాక్టర్ భారతి. లైంగిక విషయాలపట్ల పాఠకులు అడిగిన పలు సందేహాలకు వారు చెప్పిన సమాధానాలేమిటో ఇప్పుడు చూద్దాం.

1. ప్రశ్న : మేడం.. నాకు పెళ్లి అయ్యి ఆరు నెలలు అవుతుంది. మా వారు నెలసరి ఉన్నప్పుడు కూడా కలుద్దామని సతాయిస్తారు. నాకు చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఆ సమయంలో పొత్తికడుపులో నొప్పిగా ఉండడం మూలంగా వద్దనిపిస్తుంది. మా వారు అర్థం చేసుకోరు. బహిష్టు సమయంలో కలిస్తే అరిష్టమట కదా.. నిజమేనా? పిల్లలు అష్టవక్రంగా కూడా పుడతారట కదా ?

- ఎం. ఎన్, జమ్మలమడుగు

జవాబు : బహిష్టు సమయంలో నెల నెల విడుదలయ్యే అండం ఫలదీకరణ జరగక గర్భాశయం గోడల పొరలలో రక్తంతో రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో కలిస్తే గర్భమే రాదు. పిల్లలు అష్టవక్రులుగా పుట్టనే పుట్టరు. అదంతా మూఢనమ్మకం. బహిష్టు లైంగిక విజ్ఞానము, ప్రసవశాస్త్ర అధ్యయనం చేయండి. బహిష్టు సమయంలో కలవకపోవడమే మంచిది. రక్తస్రావం, హార్మోన్ల వల్ల కలిగే చిరాకు, ఆందోళనలో ఉండే స్త్రీలకు బహిష్టు సమయంలో చాలా అసౌకర్యంగా ఉండి నొప్పి అధికమవుతుంది. కాబట్టి ఈ రోజులలో స్త్రీలు సెక్స్ లో పాల్గొనకపోవడం మంచిది.

2. ప్రశ్న : మేడం.. నాకు కొడుకు పుట్టి చనిపోయాడు. నాకు వాసక్టమీ అయింది. ఇప్పుడు నాకు పిల్లలు కావాలి. నేను ఇప్పుడు వాసక్టమీ రివర్స్ చేసుకోవచ్చా ?

- ఆర్. ఎస్, కరీంనగర్

జవాబు : ఇది పెద్దగా ఫలితం చూపదు. 40 శాతం అవకాశం మాత్రమే ఉంటుంది. ప్రెగ్నెన్సీ చాన్స్ కూడా తక్కువగానే ఉంటుంది. ఒకసారి ఛాన్స్ తీసుకోవడంలో తప్పులేదు. కానీ..దీనికి బదులుగా అనాథ పిల్లల్ని దత్తత తీసుకోవడం లేదా మీ భార్యకు ఐవీఎఫ్ ద్వారా పిల్లలను ప్రయత్నం చేయొచ్చు.

- డాక్టర్ భారతి

సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ &

సెక్సువల్‌ కౌన్సెలింగ్

86885 19225

Next Story