ఆయనకు సెక్స్ కోరికలు తగ్గుతున్నాయ్.. నాకేమో అలా.. ఏం చేయమంటారు?

by Javid Pasha |   (  Updated:2025-08-02 10:49:42  IST  )

ఆయనకు సెక్స్ కోరికలు తగ్గుతున్నాయ్.. నాకేమో అలా.. ఏం చేయమంటారు?
X

దిశ, ఫీచర్స్ : దాంపత్య జీవితంలో శృంగారం ఒక భాగం. భార్యా భర్తలు సంతోషంగా ఉండాలంటే.. లైంగిక విషయాలపట్ల అవగాహన అవసరం. లేకపోతే అపార్థాలకు, సంసార జీవితంలో సమస్యలకు దారితీయవచ్చు అంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు, సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్ డాక్టర్ భారతి. లైంగిక విషయాలపట్ల పాఠకులు అడిగిన పలు సందేహాలకు వారు చెప్పిన సమాధానాలేమిటో ఇప్పుడు చూద్దాం.

మేడమ్.. నా వయసు 23 సంవత్సరాలు. ఈ మధ్యనే నాకు అబార్షన్ కూడా అయింది. మా వారిలో రోజు రోజుకి సెక్స్ కోరికలు (Sex desires) తగ్గుతున్నాయి. మొదట్లో వీర్యం బాగానే బయటకు వచ్చేది. రాను రాను చాలా తక్కువగా వస్తుంది. వారు రోజూ నైట్ జాబ్ కి వెళతారు. సిగరెట్లు, మద్యం అలవాట్లు కూడా ఉన్నాయి. తనకు నైట్ జాబ్ కావడం వల్లే ఇలా అవుతుందా ? లేక శీఘ్రస్ఖలన లోపాలు ఉన్నాయా ? మాకు పిల్లలు పుట్టే మార్గం చెప్పండి ప్లీజ్.

- ఎస్ వీ, సికింద్రాబాద్

జవాబు : ముందు వీర్యం త్వరగా బయటకు వస్తుందని రాశావు. తర్వాత వీర్యం చాలా ఆలస్యంగా వస్తుందని రాశావు. మొత్తానికి అర్థమైంది ఏమిటంటే నీ భర్తకు అంగస్తంభన సమస్యతో పాటుగా శీఘ్రస్ఖలనం ఉందని. అయితే, శీఘ్రస్ఖలనానికి, నీ అబార్షన్ కి ఏ సంబంధమూ లేదు. అంగస్తంభన సమస్యకు నీ సంతానలేమికి సంబంధం ఉంది. నీకు గర్భం వచ్చి నిలవడానికి మీ ఇద్దరూ సెక్సాలజిస్ట్ ను కలవండి. మీ వారి అంగస్తంభన సమస్యకు పరిష్కారం, సంతానం కలిగే అవకాశం ఉంటుంది.

డాక్టర్ భారతి

సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ &

సెక్సువల్‌ కౌన్సెలింగ్

Next Story