పసిపాపలనూ వదలని కామాంధులున్నారు..! కాపాడుకునేదెలా ?

by Javid Pasha |

చిన్నపిల్లలపైన అత్యాచారాలను చేసే వారిని పీడో పీలీయాలు అంటారు. వీరు ఇలా తయారు కావడానికి వాళ్ల బాల్యంలో కారణాలు వెతకాల్సి ఉంటుంది.

పసిపాపలనూ వదలని కామాంధులున్నారు..! కాపాడుకునేదెలా ?
X

ప్రశ్న : మేడం.. మా ఇంటి పక్కన ఒక ఆరేండ్ల చిన్నారి మీద అత్యాచారం జరిగింది. ఇది మమ్మల్ని చాలా కలిచి వేసింది. అత్యాచారానికి గురైన చిన్న పిల్లల్ని ఎలా గుర్తించాలి ? ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి ? మాకూ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. వారిని బయటకు పంపాలంటే భయమేస్తుంది. - ఎస్.పి. హైదరాబాద్

జవాబు : చిన్నపిల్లలపైన అత్యాచారాలను చేసే వారిని పీడో పీలీయాలు అంటారు. వీరు ఇలా తయారు కావడానికి వాళ్ల బాల్యంలో కారణాలు వెతకాల్సి ఉంటుంది. కుటుంబ, మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం, అంతర్ముకులు, భయంకరమైన శిక్షలు అనుభవించిన వాళ్లు.. ఒంటరితనంతో అనుమానాలతో... ప్రేమ రాహిత్యాలతో కూడిన బాల్య జీవితాన్ని గడిపిన వారు.. చిన్నప్పుడు లైంగికదాడులకు గురైన వారు పిల్లల మీద అత్యాచారాలు చేస్తారు. తీవ్రమైన మానసిక సమస్యలున్నవాళ్లు కూడా చిన్నపిల్లలపై అత్యాచారాలు చేస్తారు. పీడోఫీలియాలు ఎటువంటి పిల్లల్ని ఎంచుకుంటారంటే.. ఒంటరి పిల్లలు, అనాథలు, బిచ్చగాళ్లు, ప్రేమ రాహిత్యంతో బాధపడే బంధువర్గంలోని పిల్లలు, ఇంట్లో నౌకర్లతో, ట్యూషన్లలో ఎక్కువ సమయం గడిపేవాళ్లు, ప్రేమ, గుర్తింపు కోసం తపించే అమ్మాయిలు, నేరస్తుల పిల్లలు, బుద్ధిమాంద్యం ఉన్న పిల్లలు, అంగవైకల్యం వల్ల ఆత్మనూన్యతకు గురయ్యే పిల్లలు, తల్లి తండ్రి విడిపోయిన వారి పిల్లలు.. ఇలాంటివారిని పీడో పీలీయాలు ఎన్నుకుంటారు.

అత్యాచారానికి గురైన పిల్లల్ని ఎలా గుర్తించాలి ?

*మానసిక లక్షణాలు : డిప్రెషన్, ఆత్మహత్య ధోరణి, ఆందోళన, భయం, అభద్రత భావం, ఉద్రేకం, కోపం, కారణం లేకుండా ఏడవడం, అపరాధ భావనతో ఉండడం, ఒంటరితనాన్ని కోరడం, చదువులు, ఆటల్లో ఆసక్తి కోల్పోవడం.

*శారీరక లక్షణాలు : తలనొప్పి, జీర్ణ సంబంధ వ్యాధులు, ఒళ్లు నొప్పులు, ఆకలి లేకపోవడం, పోస్ట్ ట్రామేటిక్ స్ట్రెస్ డిసార్డర్, అవసరానికి మించి స్పందించడం, తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోతూ ఉండడం, పురుషులపైన తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకోవడం, ఇంట్లోంచి లేదా హాస్టల్ నుంచి పారిపోవడం, నిద్దట్లో మూత్ర విసర్జన చేయడం, తండ్రిని కూడా ముట్టుకోనివ్వకపోవడం.

*శారీరక లక్షణాలు : పిల్లల శరీరంపై గోళ్ల రక్కులు, కొరికిన గుర్తులు, ముఖ్యంగా రజస్వల కానీ ఆడపిల్లల, చిన్న పిల్లల లోదుస్తులపై రక్తం మరకలు కనిపించడం, పాయు మార్గంలో యోని చుట్టూ వాపు, ఎరుపు మంట, నొప్పి, గాయాలు ఉండడము. పిల్లలు నొప్పి మూలంగా కాళ్లు వెడల్పు చేసి నడుస్తూ ఉండడం. బాలల్లో మూత్రం పోసేటప్పుడు నొప్పి, పురుషాంగం వాచి ఉండడం, అనవసరమైన ద్రవాలు స్రవించడం, సుఖ వ్యాధుల లక్షణాలు, బాలికల్లో పై లక్షణాలతో పాటు గర్భధారణ, నగ్నంగా నిలబడరు, స్నానం కూడా చేయించనివ్వరు. పిల్లలు మూత్ర ఇన్ఫెక్షన్ వల్ల మూత్రవిసర్జన సమయంలో మంటతో ఏడుస్తుంటారు. గమనించిన వెంటనే పిల్లల్ని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్లాలి. గైనకాలజిస్ట్ పరీక్ష చేసి అత్యాచారం జరిగిందో లేదో చెప్తారు. వెంటనే చికిత్స మొదలుపెట్టాలి. అలాగే మానసిక చికిత్స ఇవ్వాలి. అన్నిటికీ మించి తల్లిదండ్రులు అవమానంగా తీసుకోకుండా పిల్లలకు పూర్తి సపోర్టు ఇవ్వాలి. గాయం మానడానికి సమయం పడుతుంది అప్పటిదాకా పిల్లని భద్రంగా కాపాడుకోవాలి. అత్యాచారం చేసిన వాళ్లు తెలిస్తే వాళ్ల మీద కేసు పెట్టాలి.

- డాక్టర్ భారతి

సెక్సువల్ హెల్త్ &ఫ్యామిలీ కౌన్సెలర్

ప్రీ & పోస్ట్ మేరేజ్ &

సెక్సువల్‌ కౌన్సెలింగ్

Next Story