పొలాల్లోకి చేరుతున్న విష వ్యర్థాలు.. రైతు బతికేదెట్ల?

by  |
suburbs of Itikala
X

దిశ,పుల్కల్: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని సూరెడ్డి ఇటిక్యాల శివారులో ఉన్న ఎంఎస్ ఇండస్ట్రీస్ పరిశ్రమ కాలుష్య జలాలను రెండు మూడు రోజులకు ఒకసారి అర్ధరాత్రి సమయంలో సింగూరు కెనాల్ కాల్వలోకి వదలటం జరుగుతుంది. దీంతో కెనాల్ నీటిలో పంటలు పండించే రైతులు తీవ్ర ఇబ్బదులు ఎదుర్కొంటున్నారు. పంట కాలువలోకి పరిశ్రమ కాలుష్య జలాలను వదలడంతో ధాన్యం దిగుబడి ఈ ఏడాది తగ్గింది. తమ పంటలకు తెగుళ్లు వస్తున్నాయని పంట దిగుబడి పై, కూరగాయల సాగుపై కాలుష్యం ప్రభావం చూపుతోందని మండల పరిధిలోని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు వెంటనే స్పందించి పరిశ్రమల్లోని కాలుష్య జలాలను సింగూరు కాల్వలకు వదలకుండా తగు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.


Next Story