సేవల రంగంలో పెరిగిన నియామకాలు

by  |
సేవల రంగంలో పెరిగిన నియామకాలు
X

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి కారణంగా గతేడాది ప్రారంభంలో కుదేలైన సేవల రంగం, డిసెంబర్ త్రైమాసికంలో పూర్తిస్థాయి ఉపాధిని సాధించినట్టు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(సీఎంఐఈ) తెలిపింది. అయితే, ఇందులో విద్యారంగం మినహాయింపు అని సీఎంఐఈ తెలిపింది. తయారీ రంగం పూర్తిగా స్తంభించినప్పటికీ రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు పూర్తిగా కోలుకున్నాయని, వ్యవసాయ రంగంలో భారీగా ఉద్యోగాలు పెరిగాయని పేర్కొంది. ‘డిసెంబర్ త్రైమాసికం నాటికి సేవల రంగంలో పోయిన ఉద్యోగాలు చాలావరకు తిరిగొచ్చాయి. ఈ త్రైమాసికంలో 13 లక్షల ఉద్యోగాలు పెరిగి దాదాపు 2 కోట్లకు చేరుకుంది. ఇది 2019-20 ఇదే త్రైమాసికానికి ఈ రంగంలో నియమించబడిన 1.94 కోట్ల కంటే ఎక్కువని సీఎంఐఈ నివేదిక తెలిపింది.


Next Story

Most Viewed