నటి కవిత శ్రీ అరెస్టు.. ఆమెలో ఈ యాంగిల్ కూడా ఉందా..?

by  |
actor-kavith-sri
X

దిశ, సినిమా : తమిళ టీవీ సీరియల్ నటి కవితా శ్రీ ని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై ఈస్ట్‌కోస్ట్ రోడ్డు కానత్తూరులోని ఓ అపార్ట్‌మెంట్‌ను లీజ్‌కు తీసుకున్న కవిత.. మహిళలు, పురుషులను ప్రైవేట్‌గా కలిపేందుకు పార్టీలు అరెంజ్ చేస్తున్నట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా ఇదే వ్యాపారం చేస్తున్న తను లక్షల్లో ఆర్జించినట్లు తెలుస్తోంది. రూ. 2 వేల ఎంట్రీ ఫీజుతో ఈ పార్టీలో జాయిన్ అయ్యే చాన్స్ ఉండగా.. మహిళలకు మాత్రం ఫ్రీ ఆఫర్ ఇచ్చేసింది.

ఇలా పార్టీలోకి ఎంటరైన మహిళలపై ఏ వ్యక్తి అయితే ఎక్కువ మొత్తంలో చెల్లిస్తారో.. ఆ రోజుకు వారిద్దరూ పార్టనర్‌లుగా ఎంజాయ్ చేసే చాన్స్ ఉంటుంది. కవిత ఇలాంటి బిజినెస్ డీల్ చేస్తుందని పోలీసులకు తెలిసినా సాక్ష్యాలు లేక ఇన్నాళ్లూ పట్టించుకోలేదు. అయితే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో ఈ పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ షేర్ చేయడంతో పాటు ఎంట్రీ ఫీజును గూగుల్‌ ద్వారా పే చేయొచ్చంటూ యాడ్ ఇచ్చింది. దీంతో రహస్య వ్యాపారానికి సంబంధించిన సమాచారం బయటపడగా పోలీసులు తనతో పాటు 15 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా 40ఏళ్లు పైబడిన వ్యక్తులే ఇక్కడ ఎంజాయ్ చేసేందుకు వస్తున్నారని వివరించారు పోలీసులు.

‘స్మార్ట్’ ట్రాప్ : వరంగల్ టు తిరుపతి ఓ బాలిక జర్నీ.. తీరా చూస్తే షాక్..!



Next Story

Most Viewed