వరుసగా రెండోరోజూ నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

by  |
Stack-Markets12
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాలను నమోదు చేశాయి. గత కొన్నిరోజులుగా జీవితకాల గరిష్ఠాల వద్ద ర్యాలీ చేస్తున్న సూచీలు లాభాల స్వీకరణ ధోరణిని ఎదుర్కొంటున్నాయి. బుధవారం నాటి ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్న స్టాక్ మార్కెట్లు చివరికి ఈ నెలలో మొదటిసారిగా సింగిల్‌డే నష్టాలను ఎదుర్కొన్నాయి. ఇన్వెస్టర్లు రికార్డు గరిష్ఠాల వద్ద లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో మార్కెట్లు అస్థిరతను ఎదుర్కొంటున్నాయి. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీల గణనీయమైన ఆదాయలను వెల్లడిస్తాయని పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా ఉంటారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ ఫలితాలతోపాటు దేశీయంగా అమ్మకాల ఒత్తిడి వల్ల మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నది. టెలికాం రంగం మినహా అన్ని రంగాల్లోనూ అమ్మకాల ఒత్తిడి అధికంగా కనిపించిందని నిపుణులు తెలిపారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 456.09 పాయింట్లను కోల్పోయి 61.259 వద్ద, నిఫ్టీ 152.15 పాయింట్ల నష్టంతో 18,266 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, మెటల్, రియల్టీ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లభాలను దక్కించుకోగా, టైటాన్, హిందూస్తాన్ యూనిలీవర్, ఎన్‌టీపీసీ, ఎల్అండ్‌టీ, పవర్‌గ్రిడ్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్ఎం, టాటా స్టీల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.89 వద్ద ఉంది.


Next Story

Most Viewed