వరుస లాభాలకు బ్రేక్

by  |
వరుస లాభాలకు బ్రేక్
X

దిశ, వెబ్‌డెస్క్: వరుస రికార్డులతో దూసుకెళ్తున్న స్టాక్ మార్కెట్లకు బ్రేక్ పడింది. వరుస ఆరు రోజుల దూకుడుకు చివర్లో అమ్మకాల ఒత్తిడి అడ్డుకట్ట వేయడంతో సూచీలు నష్టాల నుంచి తప్పించుకోలేకపోయాయి. ముఖ్యంగా ఆటో, ఫార్మా, ఎఫ్ఎంసీజీ నష్టాల కారణంగా మార్కెట్లు ఒక్కసారిగా డీలాపడ్డాయి. ఉదయం ప్రారంభం నుంచి నిన్నటి జోరును కొనసాగించిన సూచీలు చివరి గంటలో వెనుదిరిగాయి. గత వారం నుంచి బడ్జెట్ ఇచ్చిన ఉత్సాహంతో పాటు విదేశీ పెట్టుబడుల మద్దతు తోడవడంతో ఆరు సెషన్‌లలో స్టాక్ మార్కెట్లు రికార్డులను కొనసాగించాయి.

కానీ, ఫార్మా, ఆటో రంగాల కౌంటర్లలో అమ్మకాలు వెల్లువవడంతో సూచీలు ఆటుపోట్లకు గురయ్యాయి. దీంతో సెన్సెక్స్ 16.69 పాయింట్లను కోల్పోయి 51,329 వద్ద ముగియగా, నిఫ్టీ 6.50 పాయింట్లు నష్టపోయి 15,109 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఆటో, మీడియా, మెటల్, ఫార్మా రంగాలు బలహీనపడగా, బ్యాంక్, ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంకులు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, ఓఎన్‌జీసీ, టైటాన్, ఎల్అండ్‌టీ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఎంఅండ్ఎం, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, సన్‌ఫార్మా, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్, టీసీఎస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.89 వద్ద ఉంది.



Next Story

Most Viewed