లాభాల్లో ముగిసిన ఈక్విటీ మార్కెట్లు

by  |
లాభాల్లో ముగిసిన ఈక్విటీ మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మళ్లీ లాభాలను నమోదు చేశాయి. ఉదయం ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు సిద్ధపడటంతో భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా నుంచి కొంత కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారనే వార్తలతో ప్రపంచ మార్కెట్లు లాభాల్లో కదిలాయి.

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావానికి తోడు దేశీయంగా కొనుగోళ్లు జోరందుకోవడంతో మార్కెట్లు లాభాలను కొనసాగించాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 276.65 పాయింట్లు లాభపడి, 38,973 వద్ద ముగిసింది. నిఫ్టీ 86.40 పాయింట్ల లాభంతో 11,503 వద్ద ముగిసింది. నిఫ్టీలో ముఖ్యంగా మెటల్, ఐటీ, ఫార్మా, ప్రైవేట్ బ్యాంకుల రంగాలు పుంజుకుంటున్నాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో టీసీఎస్, టాటాస్టీల్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అధిక లాభాల్లో ట్రేడవ్వగా, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఆటో, పవర్‌గ్రిడ్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.29గా ఉంది.

Next Story

Most Viewed