సార్..! నన్ను 'ఆడిపోసుకోవద్దని' మీరైనా చెప్పండి.. లేదంటే

by  |
సార్..! నన్ను ఆడిపోసుకోవద్దని మీరైనా చెప్పండి.. లేదంటే
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ తో భేటీ కానున్నారు. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన కొందరు మంత్రులు తనని విమర్శిస్తున్నారని నిమ్మగడ్డ.., గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

వారం రోజుల క్రితం మంత్రులు సజ్జల రామకృష్ణారెడ్డితో పాటు పెద్దిరెడ్డి, బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డితో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి’లు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి తనని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని ఇప్పటికే నిమ్మగడ్డ.., గవర్నర్ కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో మంత్రులు చేస్తున్న విమర్శలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. లేదంటే తనకు హైకోర్ట్ అడ్వకేట్ జర్నల్ పై నమ్మకం లేదు కాబట్టి కేంద్రంలో ఉన్న అటార్నీ జనరల్ న్యాయ సలహా తీసుకొని చర్యలు తీసుకోవాలని గవర్నర్ కు రాసిన లేఖలో నిమ్మగడ్డ పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఎస్ ఈసీ లేఖపై స్పందించిన గవర్నర్.., నిమ్మగడ్డతో మాట్లాడాలని ఈరోజు సాయంత్రం 5గంటలకు పిలిపించుకున్నట్లు తెలుస్తోంది.

పనిలోపనిగా నిమ్మగడ్డతో పాటు రాష్ట్ర హైకోర్ట్ అడ్వకేట్ జర్నల్ ను గవర్నర్ రాజ్ భవన్ కు పిలిపించుకుంటున్నారు. నిమ్మగడ్డ రాసిన లేఖ పై అడ్వకేట్ జర్నల్ తో చర్చించనున్నారు. దీంతో పాటు ప్రివిలేజ్ కమిటీ సభ్యులు కోర్ట్ ను ఆశ్రయిస్తే రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయనే అంశంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.., ఎస్ ఈసీ నిమ్మగడ్డ, రాష్ట్ర హైకోర్ట్ అడ్వకేట్ జర్నల్ తో చర్చించనున్నారు.


Next Story

Most Viewed