ప్రపంచ రికార్డు కోసం నీటిలో 145 గంటలు

by  |
ప్రపంచ రికార్డు కోసం నీటిలో 145 గంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈజిప్ట్‌కు చెందిన ఓ స్కూబా డైవర్ ఎవరూ సాధించలేని ఓ సరికొత్త ప్రపంచ రికార్డును సంపాదించాడు. దిగ్గజ స్కూబా డైవర్లు కూడా చేయడానికి భయపడే ఈ విన్యాసాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని మరీ విజయం సాధించాడు. కొత్త ప్రపంచరికార్డును సృష్టించడానికి ఎర్ర సముద్రంలో 145 గంటలు అంటే ఆరు రోజుల పాటు సద్దాం అల్-కిలానీ మునిగి ఉన్నాడు. ఈ విన్యాసానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దహాబ్ తీరంలో నవంబర్ 5వ తేదీన సద్దాం ఈ విన్యాసం మొదలు పెట్టాడు. పూర్తిగా 145 గంటల 30 నిమిషాలు నీళ్ల అడుగునే ఉన్నట్లు సమాచారం. 2017లో ప్రయత్నించినపుడు 121 గంటలు ఉన్న సద్దాం, ప్రస్తుతం 142 గంటల 47 నిమిషాలతో సెర్న్ కారబే పేరు మీద ఉన్న రికార్డును తిరగరాశాడు. అయితే ఈ రికార్డును ఇంకా గిన్నిస్ వరల్డ్ రికార్డు వారు అధికారికంగా ప్రకటించలేదు. నిజానికి 150 గంటల పాటు ఉందామని సద్దాం ప్లాన్ చేసుకున్నాడు కానీ ఆరోగ్య కారణాల దృష్ట్యా నాలుగున్నర గంటల ముందే బయటికి వచ్చాడు.

Next Story