చిన్మమ్మ.. పెద్దమ్మవుతుందా?

107

దిశ,వెబ్‌డెస్క్: దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ చెన్నైకి చేరుకోనున్నారు. దీంతో చిన్నమ్మ రాకతో అరవరాజకీయాలు చిన్నవిగా ఉండబోవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేని కలవరపెడుతోంది.

జయలలిత మరణం తర్వాత సీఎం పీఠాన్ని అధిరోహించే వరకూ వెళ్లిన జయ నెచ్చెలి శశిళక అనూహ్యంగా అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యారు. అప్పటి నుంచి తమిళనాట రాజకీయం ఒక్కోరోజు ఒక్కోలా మారుతూ వస్తుంది. కోర్ట్ నాలుగేళ్ల శిక్ష విధించినప్పటికి సత్ప్రవర్తన కారణంగా కాస్త ముందుగానే విడుదలయ్యారు. తాజాగా జైలు నుంచి విడుదలైన శశికళ త్వరలో జరిగే ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయంగా నిలదొక్కుకోవాలని భారీ ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో భాగంగా నాలుగేళ్ల తరువాత ఈరోజు బెంగళూరు నుంచి చెన్నైకు రానున్న శశికళ కోసం భారీ ఎర్పాట్లు జరిగాయి. ఈ ఏర్పాట్లను శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ పర్యవేక్షిస్తున్నారు. జాజూవాడి చెక్ పోస్ట్ దగ్గర నుంచి శశికళకు స్వాగతం పలికేందుకు వేలాది వాహనాలు అందుబాటులో ఉన్నాయి. అయితే తమిళనాడు ప్రభుత్వం చిన్నమ్మ హవా కొనసాగితే కొంపలంటుకుంటాయనే ముందుగా ఓ అభిప్రాయానికి వచ్చిన ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా పేరు చెప్పి ఫ్లెక్సీలను తొలగించడం, ఐదు వాహనాలకు మించి ఎక్కవ ఉండకూడదని, ఒకవేళ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటే సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. అయితే బెంగళూరు నుంచి చెన్నైకి వస్తున్న చిన్నమ్మ జయలలిత సమాధి, స్మారకాన్ని సందర్శిస్తారనే ప్రచారం జరిగింది. దీంతో అప్రమత్తమైన తమిళనాడు ప్రభుత్వం ముందుగానే  చిన్నమ్మకు చెక్ పెడుతూ జయలలిత సమాధి, స్మారకాన్ని మూసివేయించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..