సర్పంచ్‌నే ప్రశ్నిస్తావా అంటూ.. వార్డు మెంబర్‌పై దాడి

by  |
సర్పంచ్‌నే ప్రశ్నిస్తావా అంటూ.. వార్డు మెంబర్‌పై దాడి
X

దిశ, వెబ్‌డెస్క్ : వార్డు మెంబర్‌పై సర్పంచ్ భర్త, ఉప సర్పంచ్ దాడికి యత్నించడం తీవ్ర కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెల్మల్ గ్రామానికి చెందిన బీజేపీ 13వ వార్డు మెంబర్ భోగ రాముపై దాడిగి దిగారు. గ్రామ సభలో చేసిన తీర్మానాలు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించినందుకు కక్ష్య పెంచుకుని, సర్పంచ్ భర్త మచ్చర్ల పెద్ద గంగారాం, ఉప సర్పంచ్ ముప్పేడ నారాయణ వారి అనుచరులు తమ షాప్ దగ్గరికి వచ్చి చంపుతామని బెదిరించారని తెలిపారు. ఆదివారం రోజు నా ఇంటికి వచ్చి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వారం రోజుల క్రితం సీపీకి ఫిర్యాదు చేసిన న్యాయం జరగలేదని వాపోయారు.

Next Story

Most Viewed