పిల్లలను కనడం ఇష్టం లేదంటూనే ప్రెగ్నెంట్ అయిన ‘డైరెక్టర్’..

by  |
Saras-Movie
X

దిశ, సినిమా : అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న మలయాళం పిక్చర్ ‘సారాస్’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇండస్ట్రీలో డైరెక్టర్‌ కావాలని కలలుగనే అమ్మాయి పిల్లలు కనడం ఇష్టపడదు. అదే సమయంలో సేమ్ ఒపీనియన్ ఉన్న వ్యక్తితో పరిచయం కావడం.. ప్రేమ, పెళ్లి జరిగిపోతాయి. అనుకోకుండా సారా ప్రెగ్నెంట్ అవుతుంది, తప్పక బిడ్డకు జన్మనివ్వాల్సి వస్తుంది. అప్పుడు బిడ్డ పెంపకంలోనే పూర్తి సమయం గడుపుతున్న ఆమె.. ఫిల్మ్ మేకర్ కావాలన్న తన డ్రీమ్ ఫుల్ ఫిల్ చేసుకుంటుందా? లేదా? అనేది కథ. యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమా బెస్ట్ కాంప్లిమెంట్స్, పాజిటివ్ రివ్యూస్‌తో దూసుకుపోతుండగా.. అసలు ఈ కథ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై వివరణ ఇచ్చాడు డైరెక్టర్ జూడ్ ఆంటోనీ జోసేఫ్.

వరదల నేపథ్యంలో వస్తున్న తన మూవీ ‘2403 ఫీట్ ’ కరోనా కారణంగా ఆగిపోయిందని.. దీంతో ఇంట్లోనే పనిలేక కూర్చోవాల్సి వచ్చిందని తెలిపాడు. పాండమిక్ టైమ్‌ కాబట్టి పాజిటివ్ స్టోరీస్ వినాలనుకున్న దర్శకుడు అలాంటి కథలను తన ఫేస్ బుక్ వాల్‌పై పోస్ట్ చేయాలని అభిమానులను కోరాడు. ఈ క్రమంలో 1114 స్టోరీస్ తన దృష్టికి రాగా.. త్రిస్సూర్‌కు చెందిన మెడికల్ పీజీ స్టూడెంట్ డాక్టర్ అక్షయ్ హరీశ్ కొవిడ్ స్టోరీతో పాటు మరో కథను కూడా పంపించాడని తెలిపాడు. ఆ కథే ‘సారాస్’ అని, వెంటనే దాన్ని పిక్ చేసుకుని స్క్రిప్ట్ డెవలప్ చేశానని వివరించాడు.

Next Story

Most Viewed