- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పండుగ రోజు విషాదం.. యువకుడు సజీవదహనం
<p>దిశ, మహమ్మదాబాద్ : పండుగ వేళ ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు సజీవదహనం అయిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో గురువారం సాయంత్రం జరిగింది. ఎస్ఐ రవిప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌కు చెందిన కేశవులు(25) తమ వ్యవసాయ పొలం వద్దకు మోటార్ సైకిల్ పై వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా వైకుంఠ ధామం వద్ద తాండూరు వైపు వెళ్తున్న లారీ, మోటార్ సైకిల్ ను […]</p>

X
దిశ, మహమ్మదాబాద్ : పండుగ వేళ ఓ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు సజీవదహనం అయిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో గురువారం సాయంత్రం జరిగింది. ఎస్ఐ రవిప్రకాశ్ తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌కు చెందిన కేశవులు(25) తమ వ్యవసాయ పొలం వద్దకు మోటార్ సైకిల్ పై వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా వైకుంఠ ధామం వద్ద తాండూరు వైపు వెళ్తున్న లారీ, మోటార్ సైకిల్ ను వేగంగా ఢీకొట్టింది. ఈ సంఘటనలో యువకుడు కింద పడి పోవడం, మోటార్ సైకిల్ పెట్రోల్ ట్యాంక్ పగిలి నిప్పు అంటుకోవడంతో ఆ యువకుడు అక్కడికక్కడే సజీవదహనం అయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవిప్రకాశ్ తెలిపారు.
Next Story






