సానియా మీర్జా భర్త షోయబ్‌కు తప్పిన ప్రమాదం

106

దిశ, వెబ్‌డెస్క్: టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త షోయబ్ మాలిక్‌కు పెను ప్రమాదం తప్పింది. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ప్రయాణిస్తున్న కారు.. లాహోర్‌లో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదం నుంచి మాలిక్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తాను సురక్షితంగా ఉన్నట్లు మాలిక్ ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్-6) సమావేశానికి హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.