డివోర్స్‌‌పై మరోసారి సమంత ఓపెన్.. నా లైఫ్‌లోనే ఆ ఫీలింగ్ అంటూ..

by  |
డివోర్స్‌‌పై మరోసారి సమంత ఓపెన్.. నా లైఫ్‌లోనే ఆ ఫీలింగ్ అంటూ..
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో అందమైన జంట అనగానే చై-సామ్ జోడీనే గుర్తుకు వచ్చేది. కానీ, అందరికీ షాక్ ఇస్తూ ఆ జంట విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వారిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులను షాక్‌కు గురిచేశారు. పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లు ఈ జంట అక్టోబర్‌ 2న ప్రకటించింది. అయితే ఈ 2021 ఏడాది తనకు ఎంతో సాడ్ ఇయర్ అని నటి సమంత ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. బాలీవుడ్‌, దక్షిణాదికి చెందిన పలువురు తారలతో ఇటీవల ఓ ఛానల్ స్పెషల్‌ ఇంటర్వ్యూ నిర్వహించింది. తాప్సీ, విక్కీ కౌశల్‌, సిద్దార్థ్‌ మల్హోత్రతో పాటు నటి సమంత ఈ సరదా చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.

ఈ స్పెషల్ వీడియోలో 2021 ఎలా గడిచిందో ఒక్కమాటలో చెప్పాలని తారల్ని కోరగా.. అందరూ భిన్నమైన అభిప్రాయాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘నా జీవితంలో 2021 ఓ క్లిష్టమైన ఏడాది’ అంటూ కామెంట్స్ చేసింది. డిసెంబర్‌ 6న ఈ ఇంటర్వ్యూ ఫుల్‌ వీడియో ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో ఓ స్పెషల్‌ ప్రోమో తాజాగా బయటకు వచ్చింది. ఈ వీడియో చూసిన సామ్‌ అభిమానులు..‘బీ స్ట్రాంగ్’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా విడాకుల అనంతరం మానసికంగా కుంగుబాటుకు లోనైన సామ్‌.. ఆ బాధ నుంచి బయటకు వచ్చేందుకు కెరీర్‌పై దృష్టి సారించారు. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది.

బాలయ్య అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మరో స్పెషల్ గెస్ట్.. ఎవరంటే..?


Next Story

Most Viewed