‘ఫ్యామిలీ మ్యాన్ 2’ డబ్బింగ్‌లో సామ్

by  |
‘ఫ్యామిలీ మ్యాన్ 2’ డబ్బింగ్‌లో సామ్
X

దిశ, వెబ్‌డెస్క్ : సమంత అక్కినేని.. కరోనా కారణంగా ఇన్నిరోజులు ఎలాంటి షూటింగ్స్‌కు హాజరుకాలేదు. లాక్‌డౌన్‌లో ఎంచక్కా గార్డెనింగ్ ప్లాన్ చేసి సక్సెస్ అయిన సామ్.. ఇప్పుడు ‘గ్రో విత్ మి’ అంటూ గార్డెనింగ్ లెసన్స్ కూడా చెప్తోంది. ‘గ్రో విత్ మి’ చాలెంజ్‌తో సెలెబ్రిటీస్‌ను కూడా గార్డెనింగ్ వైపు ప్రోత్సహించే ప్రయత్నం చేసింది. ఇంట్లో కూరగాయలు పెంచి, వాటిని ఆహారంగా తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉంటుందో చెప్తూ.. ఇన్ని రోజులు సోషల్ మీడియాలో బిజీగా ఉంది. కాగా ఇన్నిరోజులకు అసలు పని మీద దృష్టిపెట్టింది సామ్.

ప్రభుత్వం షూటింగ్స్‌కు అనుమతించడంతో ఇప్పుడిప్పుడే చిత్రీకరణ సాగుతుండగా.. సామ్ తన ఫస్ట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’కు డబ్బింగ్ చెప్పే పనిలో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో చాలా క్రేజీగా ఉందంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో షేర్ చేసింది. మనోజ్ బాజ్‌పాయ్ ప్రధాన పాత్రలో కనిపించనున్న సిరీస్ కోసం అభిమానులు కూడా చాలా వెయిట్ చేస్తున్నారు. కాగా, ఎలాగైనా అక్టోబర్‌లోనే అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుందని సమాచారం. దీంతో సమంత తన డబ్బింగ్ పూర్తి చేస్తున్నదని తెలుస్తోంది.

Next Story