సమంత ‘సాకి’ లాంచ్.. అదిరిపోయిన కలెక్షన్!

by  |
సమంత ‘సాకి’ లాంచ్.. అదిరిపోయిన కలెక్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్: సమంత అక్కినేని సక్సెస్‌ఫుల్ హీరోయిన్.. బ్రిలియంట్ బిజినెస్ పర్సనాలిటీ. డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకునే క్రమంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్న ఇన్‌స్పైరింగ్ లేడీ. ఇటు హీరోయిన్‌గా బ్లాక్ బస్టర్స్ అందుకుంటూనే.. ‘ఎకం’ స్కూల్ ద్వారా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన సామ్.. ఇప్పుడు మరో అడుగువేసింది. ‘సాకి’ పేరుతో క్లాతింగ్ బ్రాండ్ లాంచ్ చేసింది. కాలేజీలో చదువుతున్న సమయంలో ప్రొఫెషనల్ డిజైనర్స్ తయారు చేసిన దుస్తులను ధరించాలనే తన కోరికను నటి అయ్యాకే తీర్చుకున్న సామ్.. ప్రొఫెషనల్స్ డిజైనర్స్ తయారు చేసిన దుస్తులను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ‘సాకి’ బ్రాండ్‌ను పరిచయం చేసింది.

కరోనా వల్ల లాక్‌డౌన్ ఏడు నెలల పాటు కొనసాగినా.. అన్ని ఇబ్బందులను అధిగమిస్తూ అలాంటి క్లిష్ట సమయాల్లోనూ ‘సాకి’ కలను సాకారం చేసుకునే దిశగా పనిచేసింది సామ్. అందుకు ప్రతిఫలంగా ‘సాకి’ క్లాత్ అండ్ డిజైన్స్‌కు బిగ్గెస్ట్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటోంది. సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే ధర, సూపర్ క్వాలిటీ, స్టైలిష్ డ్రెస్‌లకు ఫిదా అయిపోయిన జనాలు.. ‘సాకి’లో షాపింగ్ కూడా స్టార్ట్ చేసేశారు. అదిరిపోయే కలెక్షన్ కోసం ‘సాకి’ని విజిట్ చేయొవచ్చని రిఫర్ కూడా చేస్తున్నారు.

ఇక ‘సాకి’ బ్రాండ్ లాంచ్ సందర్భంగా సామ్ ఫ్యాన్స్ సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. సామ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న ఫ్యాన్స్.. పాషన్, హార్డ్ వర్క్‌కు ఆల్ ది బెస్ట్ అవసరం లేదని.. నువ్వు అనుకున్నది కచ్చితంగా సాధిస్తావని చెప్తున్నారు.



Next Story